పీవీ సింధు బ్రేక్స్ డౌన్: ఎగ్జాస్ట్ అయిపోయా: 18 గంటల్లో మూడు మ్యాచ్ లా: ఏంటిది

జపాన్ నగోయాలో జరుగుతోన్న ఆసియా గేమ్స్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ లో ఓటమి పాలైన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తీవ్ర నిరాశకు గురయ్యారు. మ్యాచ్ షెడ్యూల్ పై విమర్శలు గుప్పించారు. వరుసగా మ్యాచ్‌లు ఆడాల్సి రావడం వల్ల కనీసం విశ్రాంతి తీసుకోవడానికి, అలసట నుంచి కోలుకోవడానికి తగినంత సమయం లభించలేదని, అది తన ఆటతీరుపై ప్రభావం చూపిందని ఆవేదన వ్యక్తం చేశారు. 18 గంటల వ్యవధిలో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి రావడం ఎంతగానో అలసిపోయేలా చేసిందని పేర్కొన్నారు.

ఆసియా గేమ్స్ క్వార్టర్ ఫైనల్ లో పీవీ సింధు.. చైనాకు చెందిన చెన్ యు ఫీ చేతిలో ఓడిపోయారు. మొదటి సెట్ లో విజృంభించి ఆడారామె. ఆ సెట్ ను 21-11తో అవలీలగా చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా ఆమె ఆటతీరు నెమ్మదించింది. చెన్ యు ఫీ.. సుదీర్ఘ ర్యాలీలు ఆడటం మొదలుపెట్టారు. అది సింధును మరింత అలసిపోయేలా చేసింది. చివరికి 21-11, 18-21, 10-21 తేడాతో ఈ గేమ్ ను కోల్పోయారు.

PV Sindhu Breaks Down After Asian Games Exit Three Matches in 18 Hours Took a Toll Exhausting Short Time

శనివారం నాటి గ్రూప్ మ్యాచ్‌లు ఆలస్యం కావడం, మ్యాచ్ కోర్టుల ఆకస్మిక మార్పుతో సింధు కొంత గందరగోళానికి గురయ్యారు. చాలా సమయం వేచి ఉండాల్సి వచ్చింది. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఫలితంగా ఆ రోజున హోటల్‌కు చేరుకుని, డిన్నర్ ముగించి నిద్రపోయే సరికి తెల్లవారుజామున 3 గంటలు అయింది. ఆదివారం ఉదయం 8:30 గంటలకే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కోసం బరిలోకి దిగాల్సి వచ్చింది.

చైనాను కుదిపిన భూకంపం..!!
చైనాను కుదిపిన భూకంపం..!!

దీనిపై సింధు తాజాగా స్పందించారు. తగినంత నిద్ర, విశ్రాంతి లేకపోవడమే తన ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఈ ఓటమి తనను ఎంతగానో బాధించిందని చెబుతూనే ఆమె తన కేరీర్ ను గుర్తు చేసుకున్నారు. 2014లో తాను ఆడిన మొట్టమొదటి ఆసియా గేమ్ నుంచి ఇప్పటివరకు సాగిన 12 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని నెమరువేసుకున్నారు. ఇది తనకు నాలుగో ఆసియా గేమ్ అని పేర్కొన్నారు. దేశం కోసం ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ సర్వస్వం ఒడ్డి పోరాడానని వివరించారు.

ఒక బాధాకరమైన ఓటమి తన శ్రమను తక్కువ చేయలేదని, లోపాలను సరిదిద్దుకుని మరింత బలంగా తిరిగొస్తానని ధీమా వ్యక్తం చేశారు. భారత్ కే చెందిన మరో అథ్లెట్ ఉన్నతి హుడా కూడా క్వార్టర్ ఫైనల్ లో ఓడిపోవడంతో ఆసియా గేమ్స్ లో భారత బ్యాడ్మింటన్ వ్యక్తిగత విభాగాల ప్రస్థానం ముగిసింది. ఈ సారి కూడా భారత పురుషుల టీమ్ విభాగం సాధించిన కాంస్య పతకంతోనే సరిపెట్టుకోవాల్సి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+