ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్..! పార్లమెంట్ లో షాకింగ్ సీన్స్..!

నీట్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా విద్యార్ధులు ఆందోళన చేసినా తలొగ్గకుండా చివరి నిమిషం వరకూ పదవిలో కొనసాగి, ఆ తర్వాత కేంద్రంపై ఒత్తిడి పెరిగిపోవడంతో తప్పుకున్న ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) ఇవాళ పార్లమెంట్ కు వచ్చారు. కేబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేయడంతో ప్రధాన్ ఎంపీ హోదాలోనే పార్లమెంట్ కు హాజరయ్యేందుకు వచ్చారు. అయితే ఎన్డీయే ఎంపీలు ఆయనకు ఎదురేగి ఘనస్వాగతం పలికారు.

విద్యార్ధుల ఆందోళనలకు తలొగ్గి కేబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ ను ఎన్డీయే ఎంపీలు ఇవాళ సాదరంగా పార్లమెంట్ లోకి ఆహ్వానించారు. ఏదో ఘనకార్యం చేసినట్లుగా ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్ నినాదాలు చేశారు. ఆయనకు టోపీ పెట్టి, కండువా కప్పి సన్మానించారు. ఎన్డీయే ఎంపీల స్వాగతంతో ధర్మేంద్ర ప్రధాన్ పొంగిపోగా.. అక్కడే ఉన్న ఇతర పార్టీల ఎంపీలు మాత్రం ఈ దృశ్యాలు చూస్తూ అవాక్కయ్యారు.

Dharmendra Pradhan Zindabad Slogans Greet Former Minister as NDA Leaders Give Hero s Welcome

ఇదిలా ఉంటే.. పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ తన సానుభూతిని తెలిపేందుకు ధర్మేంద్ర ప్రధాన్ వద్దకు వెళ్లారు. దీంతో అక్కడ ఆశ్చర్యకరమైన సన్నివేశం చోటుచేసుకుంది. జైరాం రమేష్ సానుభూతి తెలపగా.. ఇందుకు ప్రధాన్ స్పందిస్తూ.. పెద్దగా ఏమీ జరగలేదు.. తనది వీధుల్లో పోరాడిన చరిత్ర అని గుర్తు చేస్తూ.. ఏసీ గదుల్లో ఉండి పోరాడలేదని జైరాం రమేష్‌కు కౌంటర్ ఇచ్చారు.

ఒరిస్సాకు చెందిన ధర్మేంద్ర ప్రధాన్ .. తాను విద్యార్ధుల ఆందోళనలను అడ్డుపెట్టుకుని అసాంఘిక శక్తులు దేశాన్ని అస్దిరపరిచే ప్రమాదం ఉందని తప్పుకుంటున్నట్లు రాజీనామా లేఖలో చెప్పుకున్నారు. విద్యార్ధుల ఆందోళనల్ని గౌరవించి తప్పుకుంటున్నట్లు మాత్రం చెప్పలేదు. అయినా కేంద్రం మాత్రం ఆయన రాజీనామాను ఘనకార్యంగా చెప్పుకుంటోంది. అలాగే ఎన్డీయే ఎంపీలు కేంద్రం కోసి త్యాగం చేసినట్లుగా ప్రధాన్ ను కీర్తిస్తుండటం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+