ట్రంప్ కొత్త విమానం ఇదే.. ఆకాశంలో కదిలే శ్వేత సౌధం!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన సరికొత్త అధికారిక ప్రెసిడెన్షియల్ విమానాన్ని అత్యంత వైభవంగా ప్రపంచానికి పరిచయం చేశారు. 'ఎయిర్ ఫోర్స్ వన్' (Air Force One) గా పిలిచే ఈ కొత్త బోయింగ్ 747 విమానాన్ని వాషింగ్టన్ వెలుపల ఉన్న జాయింట్ బేస్ ఆండ్రూస్ మిలిటరీ బేస్‌లో ట్రంప్ ఆవిష్కరించారు. సుమారు 400 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.3,300 కోట్లకు పైగా) విలువైన ఈ జంబో జెట్‌ను మిడిల్ ఈస్ట్ దేశమైన కతార్ (Qatar) ప్రభుత్వం ట్రంప్‌కు కానుకగా ఇవ్వడం విశేషం.
ఈ సరికొత్త విమానాన్ని చూసిన వారంతా దీని విలాసవంతమైన రూపాన్ని బట్టి 'ఫ్లయింగ్ ప్యాలెస్' (ఆకాశంలో ప్రయాణించే రాజభవనం) అని అభివర్ణిస్తున్నారు. 1990 నుంచి సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న పాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానం స్థానంలో ఇది బాధ్యతలు స్వీకరించనుంది.
ఎలాన్ మాస్క్ 'స్టార్‌లింక్'తో హైటెక్ హంగులు
టెక్ దిగ్గజం, బిలియనీర్ ఎలాన్ మాస్క్‌తో ట్రంప్‌కు కొన్ని విషయాల్లో విభేదాలు ఉన్నప్పటికీ, తన కొత్త విమాన భద్రత - కమ్యూనికేషన్ కోసం మాత్రం మాస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ (SpaceX) కంపెనీ రూపొందించిన 'స్టార్‌లింక్' (Starlink) కమ్యూనికేషన్ టెక్నాలజీనే ట్రంప్ ఎంచుకున్నారు.
"ఇంతకు ముందెన్నడూ ఎవరూ చూడని అత్యున్నత స్థాయి కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్‌ను ఈ విమానంలో అమర్చాం. ఇందులో స్టార్‌లింక్ కూడా ఉంది. నా ఫ్రెండ్ ఎలాన్ మాస్క్ ఇది చూసి చాలా హ్యాపీగా ఫీలవుతాడు" అని ట్రంప్ సగర్వంగా ప్రకటించారు.

ఈ స్టార్‌లింక్ శాటిలైట్ వ్యవస్థ ద్వారా అధ్యక్షుడు ఆకాశంలో ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఎలాంటి అంతరాయం లేకుండా నేరుగా గ్రౌండ్ కంట్రోల్‌తో అత్యంత సురక్షితమైన వీడియో కాల్స్, హై-స్పీడ్ డేటా ట్రాన్స్‌ఫర్ చేసుకునే వీలుంటుంది.
రాజభవనాన్ని తలపించే విలాసాలు
ఈ 13 ఏళ్ల పాత రీఫర్బిష్డ్ విమానంలో అమెరికా ప్రెసిడెంట్ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా యూఎస్ ఎయిర్ ఫోర్స్ అనేక సాంకేతిక మార్పులు చేసింది. అయితే, విమానం లోపల ఉన్న లగ్జరీ ఇంటీరియర్ లేఅవుట్‌ను మాత్రం అలాగే ఉంచేశారు. "ఈ విమానాన్ని ఎవరూ ఊహించని రేంజ్‌లో ఒక 'ఫ్లయింగ్ వైట్ హౌస్'లా మార్చేశారు" అని ట్రంప్ కొనియాడారు.
విమానం వెలుపలి రంగులను ట్రంప్ తన అభిరుచికి తగ్గట్టుగా మార్చుకున్నారు. విమానం కింది భాగానికి ముదురు నేవీ బ్లూ కలర్ వేసి, తోక భాగంలో భారీ అమెరికన్ జెండాను, అధ్యక్షుడు ఎక్కే తలుపు పక్కన అధికారిక ప్రెసిడెన్షియల్ సీల్‌ను ముద్రించారు. లండన్, జర్మనీ వంటి దేశాలలో తమ విమానం ల్యాండ్ అయినప్పుడు దీనిని మించినది మరొకటి ఉండకూడదన్నదే తన తాపత్రయమని ట్రంప్ పేర్కొన్నారు.
కానుకపై ముదిరిన రాజకీయ కాంట్రవర్సీ
ఒక విదేశీ ప్రభుత్వం నుంచి ఇంత భారీ విలువైన విమానాన్ని గిఫ్ట్‌గా స్వీకరించడంపై అమెరికా రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. అటు డెమొక్రాట్లు, ఇటు రిపబ్లికన్ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఈ విమానాన్ని ఆమోదించడంలో ఉన్న నైతికతను ప్రశ్నిస్తూ ట్రంప్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, ఈ విమర్శలను ట్రంప్ కొట్టిపారేశారు. పన్ను చెల్లింపుదారుల సొమ్ము వందల మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టకుండా ఉచితంగా వస్తున్నప్పుడు వదులుకోవడం మూర్ఖత్వమే అవుతుందని సమర్థించుకున్నారు.
నిజానికి ఈ కతార్ విమానం కేవలం ఒక తాత్కాలిక 'బ్రిడ్జ్' (స్టాప్‌గ్యాప్) ఏర్పాటు మాత్రమే. మరో రెండేళ్లలో పూర్తి హంగులతో సరికొత్త ప్రెసిడెన్షియల్ విమానం రాబోతోంది. ఆ తర్వాత ఈ కతార్ జెట్‌ను 'ట్రంప్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ'కి అప్పగిస్తారు. కాగా, జూలై 4న జరగబోయే అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల (Declaration of Independence) ఫ్లైపాస్ట్‌లో ఈ విమానం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అలాగే వచ్చే నెల అంకారాలో జరగబోయే నాటో (NATO) సదస్సుకు ట్రంప్ ఈ సరికొత్త విమానంలోనే ప్రయాణించనున్నారు.
HELLO, MEET THE NEW AIR-FORCE ONE! ✈️
— Robert Zimmerman Jr. (@rzimmermanjr) June 20, 2026
AMERICAN NATIONALISM AT IT’S BEST LOOKS AMAZING. 🇺🇸 pic.twitter.com/gqZvaUqXex














Click it and Unblock the Notifications