టీడీపీకి బిగ్ షాక్.. కీలక నేత గుడ్ బై.. గెలిచిన 9 నెలలకే రాజీనామా
టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి కీలక నేత రాజీనామా చేశారు. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు, సీఎం చంద్రబాబు తనకు అప్పగించిన ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి సైతం ఆయన రాజీనామా చేశారు.వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు జీవీ రెడ్డి ప్రకటించారు. రాజీనామాపై జీవీ రెడ్డి స్పందిస్తూ..వ్యక్తిగత కారణాలతో, నేను తెలుగు దేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, జాతీయ అధికార ప్రతినిధి హోదా, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవుల నుండి రాజీనామా చేస్తున్నాను. మీరు నాపై ఉంచిన విశ్వాసానికి, అందించిన మద్ధతుకు, నాకు ఈ కీలకమైన బాధ్యతలను నిర్వహించే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
తెలుగు దేశం పార్టీ మరింత బలంగా ఎదిగి ప్రజా సేవలో ముందుడాలని ఆకాంక్షిస్తున్నాను. ఇక మీదట పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతాను. భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదని జీవీ రెడ్డి తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.ఇటీవల ఫైబర్ నెట్ ఎండీపై జీవీ రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదం నేపథ్యంలో జీవీ రెడ్డి రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.వైసీపీకి సానుభూతిపరులయిన ఉద్యోగులను తొలగించి జీవీ రెడ్డి సంచలనం సృష్టించారు.అయితే అధికారులపై కూడా జీవీ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ పంచాయితీ సీఎం వద్దకు చేరడంతో జీవీ రెడ్డిని హెచ్చరించి, అధికారులతో కలిసి పని చేసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది.

దీనిపై మనస్థాపం చెందిన ఆయన ప్రాథమిక సభ్యత్వంతో పాటు, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి సైతం రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే జీవీ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు టీడీపీకి కాస్తా ఇబ్బందికరంగా మారాయి. దీనికితోడు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ ఫైబర్ నెట్ కింద కొత్త కలెక్షన్లు ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి సమయంలోనే జీవీ రెడ్డి టీడీపీకి రాజీనామా చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఇకపై తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు.












Click it and Unblock the Notifications