వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యేక హోదా: దమ్ముంటే అంటూ సుజనా సవాల్, ప్లేస్, డేట్ చెప్పమంటూ జీవీఎల్ ప్రతిసవాల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికకి ప్రత్యేక హోదా అంశంపై బీజేపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. విభజన హామీలపై ఎక్కడైనా సరే చర్చించేందుకు సిద్ధమంటూ పరస్పరం సవాల్ విసుకున్నారు.

Recommended Video

రాజ్యసభలో ఏపీ విభజన హామీలపై చర్చ
దమ్ముంటే చర్చకు రావాలంటూ సుజనా సవాల్

దమ్ముంటే చర్చకు రావాలంటూ సుజనా సవాల్

ప్రత్యేక హోదాపై బీజేపీ తప్పు దోవపట్టిస్తోందని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ఆరోపించారు. పారిశ్రామిక కారిడార్ పేరుతో మభ్యపెట్టే ప్రకటనలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రకారం ఏపీకి రావాల్సిన నిధులను అడుగుతున్నామన్నారు. హామీల అమలుపై జీవీఎల్ నరసింహారావు అవాస్తవాలు చెబుతున్నారని, ఆయనికి దమ్ముంటే తనతో చర్చకు రావాలని సుజనా సవాల్ విసిరారు.

ఎక్కడ, ఎప్పుడు..? జీవీఎల్ ప్రతిసవాల్

ఎక్కడ, ఎప్పుడు..? జీవీఎల్ ప్రతిసవాల్

ఈ సవాల్‌ని స్వీకరించిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. తాను రెడీగా ఉన్నట్లు తెలిపారు. చర్చించేందుకు ఎక్కడికి రమ్మన్నా వస్తానని చెప్పారు. సుజనాకు దమ్ముంటే ఎప్పుడు, ఎక్కడ చర్చకొస్తారో చెప్పాలని జీవీఎల్ నరసింహారావు ప్రతి సవాల్ విసిసారు.

హోదా ప్రయోజనాలు పొందుతున్న రాష్ట్రాల్లో ఏపీ కూడా

హోదా ప్రయోజనాలు పొందుతున్న రాష్ట్రాల్లో ఏపీ కూడా

కాగా, హోదా ప్రయోజనాలు పొందుతున్న రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. రాయితీలు ఏ రాష్ట్రానికి లేవని, రాయితీలకు హోదాకు సంబంధం లేదన్నారు.

ఎస్పీవీకి ఎందుకు ముందుకు రావడం లేదు?

ఎస్పీవీకి ఎందుకు ముందుకు రావడం లేదు?

ఏపీకి ఐదేళ్లకు రెవెన్యూ లోటు భర్తీకి గ్రాంట్‌గా 22,112 కోట్లను కేంద్రం ఇస్తోందని, నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా... స్పెషల్ పర్పస్‌ వెహికల్ ఏర్పాటుకు ఏపీ ముందుకు రాలేదని ఆయన ఆరోపించారు. పారదర్శకంగా నిధులు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని భయపడుతున్నారని విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాలు, మూడు హిమాలయ రాష్ట్రాలకు హోదా లేదని, హోదా పేరు లేకున్నా ఆ ప్రయోజనాలు అందుతున్నాయని జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు.

English summary
BJP MP GVL Narasimha Rao and TDP MP Sujana Chowdary responded on Andhra Pradesh special status issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X