వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందుకే చంద్రబాబు యూటర్న్: జివిఎల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బిజెపి జాతీయ అధికార ప్రతినిధి జివిఎల్ నర్సింహారావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రాలేమని గ్రహించిన టిడిపి కేంద్రంపై నిందలు వేస్తోందని ఆయన శనివారంనాడు అన్నారు

టిడిపి రాజకీయ దురుద్దేశంతోనే వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాస్తవాలు గ్రహించాలని కోరారు. ఎపిలో రాజకీయ పార్టీలు ప్రయోజనం పొందాలని అనుకుంటున్నాయని ఆయన విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గెలువలేమనే ఉద్దేశంతో చంద్రబాబు ప్రత్యేక హోదాపై యూటర్న్ తీసుకున్నారని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు కల్లబొల్లి కబుర్లు

చంద్రబాబు కల్లబొల్లి కబుర్లు

రాజకీయ లబ్ధి కోసమే టిడిపి ఎన్డీఎ నుంచి వైదొగలగిందని జివిఎల్ అ్నారు చంద్రాబబు కబుర్లు, కల్లిబొల్లి మాటలు మాటలు చెప్తున్నారని ఆయన అన్నారు 2022 వరకు 11 సంస్థలను స్థాపించాలని చట్టంలో ఉందని, కేవలం మూడేళ్లలో 9 సంస్తలను ఏర్పాటు చేశామని చెప్పారు కేద్ర రాష్ట్రం పట్ల నిబద్దతతో ఉందని అన్నారు. ఇది కేంద్రం ఎపి కోసం చేసిన మంచి పని కాదా, చేసినవన్నీ రాష్ట్రానివి, చేయనివి కేంద్రం బాధ్యతా అని అడిగారు. చట్టంలో లేనివి కూడా కేంద్రం ఇస్తోందని అన్నారు

పట్టుబట్టింది నిజమే...

పట్టుబట్టింది నిజమే...

దుగరాజుపట్నం పోర్టు, ఉక్కు కర్మాగారం ఏర్పాటు, రైల్వే జోన్ అంశాలను పూర్తి చేస్తామనే విశ్వాసం తమకు ఉందని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదాను రాజకీయంగా వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఆర్థికంగా రాష్ట్రానికి నిధులు సమకూర్చడానికి ప్రత్యేక హోదా అని ఆయన అన్నారు. గత ప్రధాని ప్రత్యేక హోదాపై హామీ ఇస్తేనే విభజనపై ముందుకు వెళ్లాలని బిజెపి పట్టుబట్టిందని ఆయన గుర్తు చేశారు.

రెట్టింపు నిధులిచ్చాం

రెట్టింపు నిధులిచ్చాం

ఎపికి ప్రయోజనం జరగాలనే ఉద్దేశంతోనే తమ పార్టీ అప్పట్లో ప్రత్యేక హోదాను కోరిందని జివిఎల్ చెప్పారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఐదళ్లలో రెట్లు నిధులిచ్చామని ఆయన చెప్పారు. రూ. 2,44,271 కోట్లు ఎపికి కేంద్రం ఈ ఐదేళ్లల ఇస్తుందని చెప్పారు. రాష్ట్రానికి న్యాయం చేశామా, అన్యాయం చేశామా అనేది ప్రజలు ఆలోచించాలని ఆయనయ అన్నారు.

ఐదేళ్ల ఆర్థిక లోటు భర్తీ

ఐదేళ్ల ఆర్థిక లోటు భర్తీ

కేవలం ఏపికి ఐదేళ్ల ఆర్థిక లోటును భర్తీ చేశామని జివిఎల్ చెప్పారు. ఇప్పటి వరకు రూ.8991 కోట్లు ప్రత్యేక ప్యాకేజీ కింద ఇచ్చినట్లు తెలిపారు. రూ.15 వేల కోట్ల ప్రాజెక్టులు పైప్ లైన్‌లో ఉన్నాయని చెప్పారు. కేంద్ర మంత్రులుగా టిడిపి ఎంపిలు ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సినవి సాధించుకోరా అని అడిగారు కేంద్రంపై రాజకీయంగా బురద చల్లే ప్రయత్నం మంచిది కాదని అన్నారు.

నిధులకు లెక్కలు ఎందుకు చెప్పరు

నిధులకు లెక్కలు ఎందుకు చెప్పరు

ఎపికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు లెక్కలు ఎందుకు చెప్పరని జివిఎల్ అడిగారు ఐదేళ్లకు రూ.22 వేల కోట్ల లోటు భర్త అంటే ఏడాదికి రూ.16 వేల కోట్లు ఇవ్వాలని అడుగుతున్నారని ఆయన అన్నారు. అమరావతికి వేయి కోట్లు ఇస్తే 8 శాతం నిధులు మాత్రమే ఖర్చు చేశారని ఆన చెప్పారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులను ఖర్చు చేయలేదని అన్నారు.

చంద్రబాబుకు అమిత్ షా చెప్పారు

చంద్రబాబుకు అమిత్ షా చెప్పారు

ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పరు, ప్రజలకు లెక్కలు చెప్పాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని జివిఎల్ అన్నారు. అడిగేది ఎక్కువ చేసేది తక్కువ అని అన్నారు. అన్ని విధాలుగా కేంద్రం సహాయం చేస్తుందని అమిత్ షా చంద్రబాబుకు రాసిన లేఖలో చెప్పినట్లు ఆయన తెలిపారు.

English summary
The BJP national spokesperson GVL narsimha Rao retalited Andhra Pradesh CM and Telugu Desam Party chief Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X