పికె అంటే పవన్ కాదు..పాకిస్థాన్ : చంద్రబాబు - పవన్ మధ్య ఒప్పందం: జీవీఎల్ ఫైర్..!
జనసేన అధినేత పవన్ కళ్యాన్ పై బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఫైర్ అయ్యారు. పీకే అంటే మనం పవన్ కళ్యాణ్ అనుకుంటం..కానీ, పీకే అంటే జాతీయ స్థాయిలో పాకిస్థాన్ కోడ్ అనుకుంటున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు - పవన్ మద్య ఒప్పందం కుదిరిందా అని జీవిఎల్ ప్రశ్నించారు.
పికె అంటే పవన్ కాదు..పాకిస్థాన్ అంటున్నారు...
కర్నూలు సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అ న్నారు. పీకే అంటే మనం పవన్ కల్యాణ్ అనుకుంటాం, కానీ పీకే అంటే జాతీయ స్థాయిలో పాకిస్థాన్ కోడ్ అనుకుంటు న్నారని కొత్త భాష్యం చెప్పారు. వన్ కల్యాణ్ మాటలను పాకిస్థాన్ పత్రికలు వాడుకుంటున్నాయని, రాజకీయాల్లోకి జాతీయ భద్రతను లాగొద్దన్నారు. రెచ్చగొట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొద్దని, అధికార దాహం కోసం జాతీయ భద్రతను దెబ్బతీసే వ్యాఖ్యలు చేయొద్దని జీవీఎల్ సూచించారు. అలాగే చంద్రబాబు-పవన్ మధ్య ఒప్పందం కుది రిందా... అని ఆయన ప్రశ్నించారు. బీజేపీని దెబ్బతీయాలని చంద్రబాబు-పవన్ కుట్ర పన్నారని జీవీఎల్ ఆరోపిం చారు. పాకిస్థాన్ పత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన ప్రస్తావించారు.

చంద్రబాబు వ్యాఖ్యలను పాకిస్థాన్ వాడుకుంటోంది..
ప్రపంచమంతా ప్రధాని మోదీ వైపే చూస్తోందని.. తీవ్రవాద స్థావరాలపై మెరుపుదాడి చేసిన ఘనత మోదీదేనని బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఒకే ఒక్క దాడితో పెద్దసంఖ్యలో తీవ్రవాదులను మట్టుబెట్టారన్నారు. దౌత్యప రంగా భారత్ ఎన్నో విజయాలు సాధించిందని, అభినందన్‌ను విడిచిపెట్టేలా మోదీ పాక్ మెడలు వంచారని ఆయన అన్నారు. దేశమంతా మోదీని, సైన్యాన్ని కొనియాడుతున్నారని, పుల్వామా దాడిపై రాజకీయాలు చేయడం దురదృష్టక రమన్నారు. మమతాబెనర్జీ చేసిన తప్పుడు వ్యాఖ్యలను చంద్రబాబు సమర్థించారని, భారత్‌లోనూ పాకిస్తాన్‌కు హీరోలు ఉన్నారని జీవీఎల్ అన్నారు. యూటర్న్‌లు తీసుకోవడంలో చంద్రబాబు అసాధ్యుడని, చంద్రబాబు వ్యాఖ్యలను పాకి స్తాన్ బాగా వాడుకుంటోందన్నారు. జాతీయ భద్రతా వ్యవహారాల్లో రాజకీయాలు సరికాదన్నారు.












Click it and Unblock the Notifications