పవన్ కళ్యాణ్‌పై మళ్లీ: పవన్ పేరుందనే ఈ పోస్ట్.. మహేష్ కత్తికి 'సపోర్టర్' చురక

Posted By:
Subscribe to Oneindia Telugu
  Pawan's Half Knowledge Is Always Dangerous, Mahesh Posted మహేష్ కత్తికి 'సపోర్టర్' చురక | Oneindia

  అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌పై మహేష్ కత్తి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 64 విషయంలో పవన్‌ది హాఫ్ నాలెడ్జ్ అని, ఈ జీవో రద్దు విషయంలో ఆయనకు ఎవరు తప్పుడు సలహా ఇచ్చారోనని మండిపడ్డారు.

  చదవండి: నంద్యాల దెబ్బ, కొత్త కోణం: పవన్ కళ్యాణ్‌పై మహేష్ కత్తి రెచ్చిపోవడం వెనుక?

  హాఫ్ నాలెడ్జ్ ప్రమాదమని

  హాఫ్ నాలెడ్జ్ ప్రమాదమని

  ఈ మేరకు మహేష్ సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. సగం నాలెడ్జ్ ఎప్పుడూ ప్రమాదమేనని, జీవో 64పై పవన్ కళ్యాణ్‌కు ఎవరు సలహా ఇచ్చారోనని, ఈ విషయంలో వారు తప్పుడు సలహా ఇచ్చారని పేర్కొన్నారు.

  ధర్నా పోస్ట్

  ధర్నా పోస్ట్

  అంతేకాదు, గుంటూరులో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న వ్యవసాయ విద్యార్థులకు సంబంధించిన ఫోటో ఒకటి పేపర్‌లో వచ్చింది. దానిని పోస్ట్ చేసి, పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించారు.

  పవన్ మాతో చెలగాటమాడుతున్నారని గుంటూరులో విద్యార్థులు

  పవన్ మాతో చెలగాటమాడుతున్నారని గుంటూరులో విద్యార్థులు

  కాగా, వ్యవసాయ పట్టభద్రుల సంఘం పవన్ పైన మండిపడింది. కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగింది. పవన్ కళ్యాణ్ తమ జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. జీవో 64 రద్దును వ్యతిరేకిస్తున్న వర్గం కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత పవన్ కళ్యాణ్ అభిప్రాయం చెప్పాల్సిందని అన్నారు.

  పవన్‌కు అవేమిటో తెలియకపోవడం వల్లే

  పవన్‌కు అవేమిటో తెలియకపోవడం వల్లే

  పవన్‌కు ఐఏఆర్, ఐసిఐఆర్ అంటే ఏమిటో కూడా తెలియకపోవడంతో సమస్య తలెత్తిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖలోని ఏవో, ఇతర ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తే తమ ప్రతిభను నిరూపించుకొని ఉద్యోగాలను సాధించుకుంటామన్నారు.

  పవన్ కళ్యాణ్ పేరు ఉందని పోస్ట్ చేశారు

  పవన్ కళ్యాణ్ పేరు ఉందని పోస్ట్ చేశారు

  ఇదిలా ఉండగా మహేష్ కత్తి పెట్టిన పోస్టును తప్పుపడుతూ ఓ వ్యక్తి సమాధానం ఇచ్చారు. తాను మహేష్ కత్తి అభిమానిని అని, కానీ జీవో 64 విషయంలో పవన్‌ను వ్యతిరేకించడం సరికాదని అభిప్రాయపడ్డారు. మ్యాటర్‌లో పవన్ కళ్యాణ్ అనే పేరు ఉంది కాబట్టి పోస్ట్ చేశారని అని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు జీవో 64 చాలా దారుణమైనదని పేర్కొన్నారు. 30 రోజులు పోరాడినా ఎవరూ పట్టించుకోలేదని, దీంతో పవన్ వద్దకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. అసలు పవన్ ఏం తప్పు చేశారని ప్రశ్నించారు. ఈ విషయంలో వ్యతిరేకించినప్పటికీ తాను అన్ని విషయాల్లో మహేష్ కత్తిని సపోర్ట్ చేస్తానని పేర్కొన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  'Half knowledge is always dangerous. I don't know who advises Pawan Kalyan on his decisions. They are only doing a bad job of it.' Mahesh posted on Facebook.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి