నక్కా ఆనంద్‌కు 'వేమూరు' సెంటిమెంట్ కలిసొచ్చింది! సగం మంత్రులే
గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఆదివారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన 2009లో తొలిసారి పోటీ చేశారు.
అమరావతి: గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఆదివారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన 2009లో తొలిసారి పోటీ చేశారు. వివాదరహితుడిగా పేరు ఉంది. పార్టీకి విధేయుడు. టిడిపి ఆవిర్భావం నుంచి ఉన్నారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు.
అయితే, వేమూరు నియోజకవర్గం కూడా ఆయనకు లక్కుగా కలిసి వచ్చిందని అంటున్నారు. ఇప్పటివరకు జరిగిన 12 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన వారిలో ఆరుగురు మంత్రి పదవులు సాధించారు. 1962లో వేమూరు నియోజకవర్గం ఏర్పడింది. మంత్రి పదవులకు కలిసొచ్చే స్థానంగా పేరొందింది.
వారిలో నాదెండ్ల భాస్కర రావు ముఖ్యమంత్రి అయ్యారు. అదే సెంటిమెంట్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న నక్కా ఆనంద బాబుకు కూడా కలిసొచ్చి మంత్రి అయ్యారని అంటున్నారు.

తొలిగా ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన కల్లూరి చంద్రమౌళి మంత్రి పదవి దక్కించుకున్నారు. 1967, 1972 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో యడ్లపాటి వెంకట్రావు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు.
1978లో మూడోసారి సారి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి మంత్రి అయ్యారు. 1983 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా గెలిచిన నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అయ్యారు. 1985లో జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి కొడాలి వీరయ్య చౌదరి గెలిచారు.
1989లో కాంగ్రెస్ అభ్యర్థి ఆలపాటి ధర్మారావు గెలిచి, మంత్రి అయ్యారు. 1999లో టిడిపి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలిచారు. అప్పుడు పదవి దక్కలేదు. రెండోసారి 1999లో గెలిచిన మంత్రి పదవి దక్కించుకున్నారు.
2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సతీష్ పాల్‌రాజ్ గెలుపొందారు. 2009లో ప్రస్తుత ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు టిడిపి అభ్యర్థిగా గెలిచారు. ప్రతిపక్షంలో ఉన్నారు. 2014లో జరిగిన ఎన్నికలు మరోసారి టిడిపి నుంచి గెలిచారు. ఇఫ్పుడు ఈయన మంత్రి పదవి దక్కించుకున్నారు.












Click it and Unblock the Notifications