హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హనుమాన్ జయంతి: శోభాయాత్ర ధూంధాం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం నగర వీధులన్నీ కాషాయమయమయ్యాయి. గౌలీగూడ చమన్ నుంచి సికింద్రాబాద్ తాడ్‌బంద్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం వరకు నిర్వహించిన శోభాయాత్ర ఘనంగా జరిగింది.

గౌలీగూడ నుంచి నారాయణగూడ, ఆర్టీసి క్రాస్‌రోడ్డు, అశోక్‌నగర్, ప్యారడైజ్, బోయిన్‌పల్లి ప్రాంతాల మీదుగా వేలాది మంది భక్తుల ఆంజనేయ నామస్మరణతో సాగిన ఈ యాత్రలో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

యాత్ర వెళ్లే దారిలోని అన్ని ప్రాంతాల్లో బ్యారికేడ్లు, ముళ్ల కంచెలను కూడా ఏర్పాటు చేశారు. ఉదయం శోభయాత్ర ప్రారంభమయ్యే సమయానికల్లా గౌలిగూడ చమన్ ప్రాంతానికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున యువకులు మోటారు బైక్‌లపై, కాషాయపు జెండాలతో హాజరయ్యారు.

హనుమాన్ జయంతి

హనుమాన్ జయంతి

యాత్రలో భాగంగా ఊరేగించిన భారీ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది. యాత్ర కొనసాగిన ప్రాంతాలన్నీ భక్తుల నినాదాలతో దద్దరిల్లిపోయాయి.

హనుమాన్ జయంతి

హనుమాన్ జయంతి

ఊరేగింపులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆంజనేయస్వామిని స్మరిస్తూ ఉండటంతో యాత్రలో ఆధ్యాత్మికత, భక్త్భివం వెల్లువెత్తింది. యాత్ర వెళ్లిన ప్రాంతాల్లో సాధారణ ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు అప్పటికపుడు ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల్లో దారి మళ్లించారు.

హనుమాన్ జయంతి

హనుమాన్ జయంతి

నిత్యం రద్దీగా ఉండే నారాయణగూడ, అశోక్‌నగర్, ప్యారడైజ్ తదితర ప్రాంతాల్లో శోభయాత్ర కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది.

హనుమాన్ జయంతి

హనుమాన్ జయంతి

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నగరంలోని పలు ప్రాంతాలతో పాటు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసారి న్యూ సిటీలో కూడా హనుమాన్ జయంతి పర్వదినం ఘనంగా జరిగింది.పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు కూడా జరిగాయి. పలుచోట్ల ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు దర్శనమిచ్చారు.

హనుమాన్ జయంతి

హనుమాన్ జయంతి

భాగ్యనగరంలో విహెచ్‌పి, భజ్‌రంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ జయంతి శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. పాతబస్తీ గౌలిగూడ రామ మందిరం నుంచి మంగళవారం ఉదయం ప్రారంభమైన యాత్ర సుదీర్ఘంగా సాగి సాయంత్రం బోయిన్‌పల్లి తాడుబంద్ ఆలయం వరకు చేరుకుంది. అక్కడ పూజల అనంతరం యాత్ర ముగిసింది.

హనుమాన్ జయంతి

హనుమాన్ జయంతి

వేల సంఖ్యలో భక్తులు యాత్రలో పాల్గొన్నారు. యాత్ర ప్రశాతంగా శాంతియుత వాతావరణంలో ముగియడంతో నగర పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

హనుమాన్ జయంతి

హనుమాన్ జయంతి

హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఎవరైనా వ్యవహరిస్తే ఉపేక్షించేదిలేదని విశ్వహిందు పరిషత్ జాతీయ ప్రదాన కార్యదర్శి చంపత్‌రాయ్ అన్నారు. రాముడితో రాజకీయాలు చేసే వారిని వదిలిపెట్టబోమన్నారు.

హనుమాన్ జయంతి

హనుమాన్ జయంతి

ఊరేగింపులో పాల్గొన్న యువకులకు పలు స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలు రోడ్లకు ఇరువైపులా ఏర్పాటు చేసిన వేదికలపై అల్పాహారం, మంచినీటి ప్యాకెట్లను పంపిణీ చేశారు.

హనుమాన్ జయంతి

హనుమాన్ జయంతి

యాత్రలో భాగంగా ఊరేగించిన భారీ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది. యాత్ర కొనసాగిన ప్రాంతాలన్నీ భక్తుల నినాదాలతో దద్దరిల్లిపోయాయి.

హనుమాన్ జయంతి

హనుమాన్ జయంతి

ఊరేగింపులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆంజనేయస్వామిని స్మరిస్తూ ఉండటంతో యాత్రలో ఆధ్యాత్మికత, భక్త్భివం వెల్లువెత్తింది. యాత్ర వెళ్లిన ప్రాంతాల్లో సాధారణ ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు అప్పటికపుడు ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల్లో దారి మళ్లించారు.

English summary
Hanuman Jayanthi Rally in Hyderabad on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X