రూంలోకి తీసుకెళ్లి కౌగిలింత: అమ్మాయిల పట్ల వర్సిటీ జేడీ అసభ్యత

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయనగరం: విజయనగరం బైబిల్ వర్సిటీలో జేడీ (జాయింట్ డైరెక్టర్) ప్రసన్న పైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఆయన వర్సిటీలోని అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. బాలికలను లైంగికంగా వేధిస్తున్నారని మండిపడుతున్నారు.

బాధితులు కొందరు ఆయన చర్యల పైన ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ వివరించారు. అతను ఓ అమ్మాయిని మీ తండ్రి పిలుస్తున్నాడని చెప్పి తన పర్సనల్ గదికి తీసుకు వెళ్లి, గట్టిగా హత్తుకున్నాడని, ఆమె వదలమని దండం పెట్టి బతిమాలిందని చెబుతున్నారు.

ఇరవై మందికి పైగా అతని బాధితులు ఉన్నారని అంటున్నారు. అందులో పదిహేను మంది వరకు అతనికి లోబడ్డ వారేనని, అతనికి అండగా ఉంటున్నారని చెబుతున్నారు. ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న అతనిని ఎట్టి పరిస్థితుల్లోను విడిచి పెట్టవద్దని డిమాండ్ చేస్తున్నారు.

harassment to girl students in vizianagaram

మరో యువకుడు మాట్లాడుతూ.. తన చెల్లెలు చెప్పడంతో తాను వచ్చానని, సాక్షాధారాలతో అతని చర్యలను నిరూపిద్దామని వచ్చామని చెప్పారు. అమ్మాయిలను అతను మానసికంగా వేధిస్తున్నారని చెప్పారు. బ్లాక్ మెయిల్ చేస్తున్నాడన్నారు. మిగతా అమ్మాయిలు అతని బారిన పడకుండా ఉండేందుకు వచ్చామని చెబుతున్నారు.

మరో విద్యార్థి మాట్లాడుతూ.. అతనిని చూస్తే ఎంతో ప్రేమగా ఉన్న వ్యక్తిలా కనిపిస్తాడని, లోపల మాత్రం అతనిది క్రూర చర్య అన్నారు. మాటలతోనే అతను లోబరచుకుంటారని చెప్పారు. అందుకే నాలుగేళ్ల తర్వాత అతని విషయం బయటపడిందన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
harassment to girl students in vizianagaram.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి