విద్యార్థులకు సిఎంరమేష్ సంఘీభావం, హరికృష్ణ ఖండన

Harikrishna and CM Ramesh
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నివాసం వద్ద ఆందోళన చేసిన సీమాంధ్ర విద్యార్థులకు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ గురువారం సంఘీభావం తెలిపారు. తెలంగాణపై కేబినెట్ నోట్ రానున్న నేపథ్యంలో సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్యకార్యాచరణ సమితి నాయకులు పలువురు ప్రధాని నివాసం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ సమయంలో సిఎం రమేష్ వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విభజన ద్వారా ఉభయ ప్రాంతాలకు న్యాయం చేస్తేనే తాము ఒప్పుకుంటామని చెప్పారు. ఏ ప్రాంతానికి న్యాయం జరగకున్నా తాము విభజనకు వ్యతిరేకమే అన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని ముందు వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెసు వారిని బుజ్జగించేందుకే ఆంటోని కమిటీని వేశారని ధ్వజమెత్తారు. తెలంగాణను కేబినెట్‌కు టేబిల్ ఐటంగా తీసుకు రావడం ఏమిటని ప్రశ్నించారు. మంత్రులకు ముందే ఇస్తే చదువుకుంటారని, వ్యతిరేకిస్తారని దొంగచాటుగా టేబుల్ ఐటెంగా తీసుకు వచ్చారన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలతో లాలూచీపడి సీమాంధ్రకు న్యాయం చేయకుండా విభజన చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాగా, సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రధాని నివాసం వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్టు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ ఖండించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+