మాజీ ఎంపీ ఇంట్లో జూ.ఎన్టీఆర్, చేయి కలిపిన హరికృష్ణ
రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తండ్రి హరికృష్ణ, తనయుడు జూనియర్ ఎన్టీఆర్ శుక్రవారం నాడు సందడి చేశారు. కాకినాడ సర్పవరంలో మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి ఇంట్లో జరిగే వేడుకలో పాల్గొనేందుకు జూ ఎన్టీఆర్ వచ్చారు.
జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు మాజీ ఎంపి నందమూరి హరికృష్ణ, మరో నటుడు కళ్యాణ్ రామ్, జూనియర్ సతీమణి లక్ష్మీ ప్రణతిలు వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి నేరుగా కాకినాడకు వెళ్లారు.

జూనియర్ ఎన్టీఆర్ వెళ్తుండగా ఆయనను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. చాలామంది ఆయనను తమ ఫోన్‌లలో బంధించారు. కొందరు ఆయనతో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. మాజీ ఎంపీ చుండ్రు నివాసంలో హరికృష్ణ, జూ.ఎన్టీఆర్ చేతులు కలిపారు.












Click it and Unblock the Notifications