పవన్ సమక్షంలో జనసేనలోకి హరిరామజోగయ్య కుమారుడు
పశ్చిమగోదావరి: సీనియర్ రాజకీయ నేత చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. జనసేన భావజాలానికి ఆకర్షితుడై జనసేన పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు.

జనసేన పోరాట యాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించిన పవన్.. ఆ తర్వాత భీమవరం తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యలో పాలకొల్లు పట్టణంలో సీనియర్ రాజకీయ నేత హరిరామజోగయ్యను వారి నివాసంలో కలుసుకున్నారు.

సుమారు గంటపాటు సమకాలీన రాజకీయాలపై వీరిద్దరు చర్చించారు. పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటాన్ని హరిరామజోగయ్య మెచ్చుకున్నారు. అంతేగాక, ఆయన రచించిన 60వసంతాల నా రాజకీయ ప్రస్తానం అనే పుస్తకాన్ని పవన్‌కు బహూకరించారు. ఈ సందర్భంగానే సూర్యప్రకాశ్ జనసేనలో చేరారు.












Click it and Unblock the Notifications