Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దళిత లోకానికి చీకటి రోజు.. బాలికపై అత్యాచారం, పోలీస్‌స్టేషన్లోనే యువకుడి శిరోముండనం

అమరావతి: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వెదుళ్లపల్లిలో వరప్రసాద్ అనే ఎస్సీ యువకుడిపై దాడి చేయడంతోపాటు పోలీస్ స్టేషన్లోనే యువకుడికి శిరోముండనం చేయడంపై మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్రంగా మండిపడ్డారు. పోలీసు ఉన్నతాధికారులకే తెలిసే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు.

పోలీస్ స్టేషన్లోనే శిరోముండనమా?

పోలీస్ స్టేషన్లోనే శిరోముండనమా?

ఎస్సీలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం పోలీస్ స్టేషన్‌లోనే శిరోముండనం చేయిస్తుందా? అని హర్షకుమార్ ప్రశ్నించారు. బాధ్యులైన అందర్నీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు రోజులు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి గురైన బాలికకు న్యాయం చేయలేదని మండిపడ్డారు.ఈ కేసులో ఉన్నతాధికారులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ బాలికపై అత్యాచారం, మరో ఎస్సీ యువకుడికి శిరోముండనం ఇదేనా రాష్ట్రంలో తమకు జరుగుతున్న న్యాయం అంటూ నిలదీశారు. ఈ ఘటనలు ఎస్సీ ప్రజాప్రతినిధులు, హోంమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలకు అవమానమేనని హర్షకుమార్ అన్నారు.

హర్షకుమార్ తీవ్ర హెచ్చరిక..

హర్షకుమార్ తీవ్ర హెచ్చరిక..

ఎస్సీలను ఖచ్చితంగా అణిచివేయాలనే ప్రభుత్వం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెయిడ్ బ్యాచ్‌లకు ప్రభుత్వం డబ్బులిచ్చి పోషిస్తోందని హర్షకుమార్ ధ్వజమెత్తారు. పార్టీ ముసుగులు వదిలేసి అందరూ ఈ ఘటనలను ఖండించాలన్నారు. 24 గంటల్లో శిరోముండనం వెనుక ఉన్నవాళ్లపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అంతేగాక, సీతానగరం వద్ద అక్రమ ఇసుక ర్యాంపులన్నీ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇసుక లారీలను అడ్డుకున్నందుకే తనపై దాడి చేశారని బాధిత యువకుడు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

క్లాస్ట్ ఫ్టస్ రావాలంటే మిగితావాళ్లు పరీక్ష రాయొద్దు..

క్లాస్ట్ ఫ్టస్ రావాలంటే మిగితావాళ్లు పరీక్ష రాయొద్దు..

మరోవైపున, టీడీపీ నేత వంగలపూడి అనిత కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ఒకరోజున నేను Class First రావాలంటే ఎం చెయ్యాలి అన్నాడు బాబు, మిగతావాళ్ళు ఎక్జాం రాయకుండా చెయ్యాలి అన్నారు ఆయన. అప్పటి నుంచి బాబుది అదే సూత్రం. మద్యపాన నిషేధం చెయ్యాలంటే మద్యం రేట్లు పెంచాలి, కరోనా టైంలో బయట తిరగకూడదు అంటే పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచాలి' అంటూ సీఎం జగన్ వైఖరిపై ఆమె మండిపడ్డారు.

ఏపీ సర్కారుకు అంబేద్కర్ రాజ్యాంగంతో బుద్ధి చెబుదాం

ఏపీ సర్కారుకు అంబేద్కర్ రాజ్యాంగంతో బుద్ధి చెబుదాం

‘దళితుల పై కక్షగట్టి వేధిస్తున్న రాజారెడ్డి రాజ్యాంగ నిర్మాత జగన్ రెడ్డి‌కి అంబేద్కర్ గారి రాజ్యాంగంతో బుద్ధి చెబుతాం. వరప్రసాద్ పై దాడి చేసిన పోలీసులను, దాని వెనుక ఉన్న వైకాపా నాయకుల్ని కఠినంగా శిక్షించాలి. అహంకారానికి నిలువెత్తు రూపం జగన్ రెడ్డి. వైకాపా ప్రభుత్వందళిత బిడ్డ కి శిరోముండనం చెయ్యడం దళిత లోకానికి చీకటి రోజు. అధికార పార్టీ నాయకుడి అక్రమాలను అడ్డుకున్నందుకు వరప్రసాద్ పై పోలీసులే రౌడీల్లా దాడి చేసి అవమానించారు' అంటూ అనిత ఘాటుగా స్పందించారు.

Recommended Video

    Tollywood Director Wise Words On Covid 19 | Oneindia Telugu
    వైఎస్ జగన్‌కు ఓపెన్ ఛాలెంజ్..

    వైఎస్ జగన్‌కు ఓపెన్ ఛాలెంజ్..

    అంతేగాక, ‘రూ. 5/- బాచ్ నేను ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి అమ్మానని ఒక పేపర్ కటింగ్ వేస్తున్నారు. OPEN CHALLENGE...ప్రభుత్వం మీది,ఆ విషయంలో నా తప్పు ఉందని ప్రూవ్ చేసి,న్యాయపరంగా ఎటువంటి చర్యలు అయినా తీసుకోండి. నేను ready, లేదంటే మీ పెంపుడు కుక్కలని కంట్రోల్‌లో పెట్టండి' అంటూ వంగలపూడి అనిత సవాల్ విసిరారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+