ఈవీఎంలపై జగన్ వైఖరి స్పష్టం

Haryana Assembly Election Results 2024: ఓట్ల లెక్కింపు సందర్భంగా హర్యానాలో చోటు చేసుకున్న పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోన్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసిన తరువాత అందరి దృష్టీ దీని మీదే మళ్లింది. ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ల వ్యవస్థను ప్రవేశపెట్టాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. పోస్టల్ బ్యాలెట్‌లో సునామీ సృష్టించిన ఆ పార్టీ..ఈవీఎంలను తెరిచిన తరువాత కుప్పకూలింది. ఈవీఎం కౌంటింగ్‌ ఆరంభమైన తరువాత భారతీయ జనతా పార్టీ దూసుకెళ్లింది. భారీ మెజారిటీని సాధించింది.

Haryana Assembly elections results 2024 We make move towards Paper Ballot says YS Jagan

పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో తొలి గంటలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 71 నియోజకవర్గాల్లో ఆధిక్యతలో కొనసాగారు. ఆ తరువాత ఫలితాలు తారుమారు అయ్యాయి. బీజేపీ ఒక్క ఉదుటున ఆధిక్యతను సాధించింది. ఈవీఎంలల్లో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ కాంగ్రెస్ ఆధిక్యత భారీగా తగ్గుతూ వచ్చింది.

అప్పటివరకు కనీసం పోటీ ఇవ్వలేని స్థితిలో కనిపించిన బీజేపీ ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది. చివరికి- 48 సీట్లతో బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది హర్యానాలో. 71 స్థానాల్లో ఆధిక్యతలో కనిపించిన కాంగ్రెస్ 37 నియోజకవర్గాలకే పరిమితమైంది. ఈ పరిణామాలను కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది. ఈవీఎంల పనితీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ పరిణామాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. హర్యానా ఎన్నికల ఫలితాలను ఆయన ఏపీతో పోల్చారు. ఏపీ తరహాలోనే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంచనా వేసినప్పటికీ భిన్నమైన ఫలితం వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

దేశంలో మళ్లీ పేపర్ బ్యాలెట్ల ద్వారా ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం ఏర్పడిందని జగన్ పేర్కొన్నారు. పోలింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగించడం సమర్థనీయం కాదని చెప్పారు. ఏపీ తరహాలోనే హర్యానా ఎన్నికల ఫలితాలు కూడా వెలువడ్డాయని, అందరి అంచనాలకు తలకిందులు చేశాయని జగన్ వ్యాఖ్యానించారు.

భారత్ వంటి అతి పెద్ద దేశంలో ప్రజాస్వామ్యం అనేది బలంగా నిలబడాల్సిన అవసరం ఉందని, మరింత పరిఢవిల్లేలా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. దీనికి ఏకైక మార్గం- ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లను వినియోగించడం ఒక్కటేనని జగన్ స్పష్టం చేశారు. బ్యాలెట్ పేపర్ల వినియోగాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అన్నారు.

అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, నార్వే, డెన్మార్క్‌ వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలు పేపర్ బ్యాలెట్లను వినియోగిస్తోన్న విషయాన్ని జగన్ గుర్తు చేశారు. ఆయా దేశాల తరహాలోనే మనం కూడా బ్యాలెట్ల వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.

బ్యాలెట్ల వినియోగం ఓటర్ల విశ్వాసాన్ని పెంచుతుందని, దీనికోసం ముందుకు రావాలని వివిధ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జగన్ తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో ఓ పోస్ట్ పెట్టారు. దీన్ని బీజేపీ, కాంగ్రెస్, డీఎంకే, బీఆర్ఎస్, సమాజ్‌వాది పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఏఐఏడీఎంకే, శివసేన, తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, జనతాదళ్ (సెక్యులర్), సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ, వంటి అన్ని పార్టీలకూ ట్యాగ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+