హవాలాలో బెల్ ఉద్యోగులు, 2 కోట్లు స్వాధీనం(ఫోటోలు)
హైదరాబాద్: హైదరాబాద్‌ను నేర రహిత నగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ఒక పక్క కసరత్తు చేస్తుంటే నేరగాళ్లు తమ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఢిల్లీ, ముంబయిలో జోరుగా హవాలా రాకెట్లను నడుపుతున్న వారంతా ఆ కార్యకలాపాలను హైదరాబాద్‌లోనూ విస్తరిస్తున్నారు.
ఈ ఏడాది టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇప్పటి వరకు పది హవాలా రాకెట్ల గుట్టును రట్టు చేశారు. తాజాగా 11వ రాకెట్‌ను సెంట్రల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను టాస్క్‌ఫోర్స్ ఉపకమిషనర్ బి.లింబారెడ్డి గురువారం వెల్లడించారు.
ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని బిలాయ్‌కి చెందిన రమేష్‌చంద్ గోయల్ బెల్ కంపెనీలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మాధవ్‌రాం బిలాయ్ ఇంజనీరింగ్ కార్పొరేషన్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.

హవాలాలో బెల్ కంపెనీ ఉద్యోగులు.. 2 కోట్లు స్వాధీనం
ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని బిలాయ్‌కి చెందిన రమేష్‌చంద్ గోయల్ బెల్ కంపెనీలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మాధవ్‌రాం బిలాయ్ ఇంజనీరింగ్ కార్పొరేషన్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.

హవాలాలో బెల్ కంపెనీ ఉద్యోగులు.. 2 కోట్లు స్వాధీనం
కాచిగూడలోని జువెలరీ షాపులో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్న దర్శన్ తుర్కియ, ముంబయిలోని రాజ్వాడి భోగ్ కంపెనీ అధినేత పియూష్ అజ్మీర కలిసి 89 లక్షల 87 వేల 5 వందల రూపాయలతో కారులో ఆబిడ్స్‌లోని చర్మాస్ వద్ద వేచి ఉన్నారు.

హవాలాలో బెల్ కంపెనీ ఉద్యోగులు.. 2 కోట్లు స్వాధీనం
ఈ డబ్బులను వారు రమేష్‌చంద్ గోయల్, మాధవ్‌రాంకు అందజేయాల్సి ఉంది. సమాచారం అందడంతో మధ్య మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దర్శన్ తుర్కియ, పియూష్ అజ్మీరను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న నగదుకు సంబంధించి ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేవు.

హవాలాలో బెల్ కంపెనీ ఉద్యోగులు.. 2 కోట్లు స్వాధీనం
వారి వద్ద ఉన్న నగదుకు సంబంధించి ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేవు. పోలీసులు ఇద్దర్ని విచారించగా రమేష్‌చంద్, మాధవ్‌రాం పేర్లు వెలుగులోకి వచ్చాయి. మాసబ్‌ట్యాంక్ వద్ద గల గోల్కొండ హోటల్‌లో బస చేసిన వారిద్దర్నీ పోలీసులు అరెస్టు చేశారు.

హవాలాలో బెల్ కంపెనీ ఉద్యోగులు.. 2 కోట్లు స్వాధీనం
నిందితుల్లో దర్శన్, అతడి యజమాని ప్రశాంత్ ఎన్నికల సమయంలో దొడ్డిదారిన 8 కోట్ల 36 లక్షల రూపాయలు తరలిస్తుండగా శంషాబాద్ పోలీసులకు దొరికిపోయారు.
కాచిగూడలోని జువెలరీ షాపులో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్న దర్శన్ తుర్కియ, ముంబయిలోని రాజ్వాడి భోగ్ కంపెనీ అధినేత పియూష్ అజ్మీర కలిసి 89 లక్షల 87 వేల 5 వందల రూపాయలతో కారులో ఆబిడ్స్‌లోని చర్మాస్ వద్ద వేచి ఉన్నారు. ఈ డబ్బులను వారు రమేష్‌చంద్ గోయల్, మాధవ్‌రాంకు అందజేయాల్సి ఉంది.
సమాచారం అందడంతో మధ్య మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దర్శన్ తుర్కియ, పియూష్ అజ్మీరను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న నగదుకు సంబంధించి ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేవు. పోలీసులు ఇద్దర్ని విచారించగా రమేష్‌చంద్, మాధవ్‌రాం పేర్లు వెలుగులోకి వచ్చాయి. మాసబ్‌ట్యాంక్ వద్ద గల గోల్కొండ హోటల్‌లో బస చేసిన వారిద్దర్నీ పోలీసులు అరెస్టు చేశారు.
దీనికి ముందుగానే దర్శన్, పియూ్‌ష్ కలిసి కోటి 20 లక్షల రూపాయలను వారికి అందజేశారు. ఇది కాకుండా మరో 89 లక్షల 87 వేల 500 రూపాయలను అందజేయడానికి సిద్ధంగా ఉండగా పోలీసులకు దొరికిపోయారు. నిందితులు నలుగురి నుంచి పోలీసులు 2 కోట్ల 9 లక్షల 87 వేల 500 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల్లో దర్శన్, అతడి యజమాని ప్రశాంత్ ఎన్నికల సమయంలో దొడ్డిదారిన 8 కోట్ల 36 లక్షల రూపాయలు తరలిస్తుండగా శంషాబాద్ పోలీసులకు దొరికిపోయారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది.. ఎక్కడికి తీసుకెళ్తున్నారు అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications