ప్రజల కోసం తగ్గుతాడు.. ప్రజాస్వామ్యంలో నెగ్గుతాడు
Happy Birthday Pawan Kalyan: నేడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బర్త్ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పుట్టినరోజు వేడుకలను జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా జరుపుకొంటోన్నారు. పలు చోట్ల కేక్ లు కట్ చేస్తోన్నారు. స్వీట్లను పంచిపెడుతున్నారు. అలాగే కొన్ని సేవా కార్యక్రమాలను సైతం చేపట్టారు. రక్తదాన శిబిరాలను నిర్వహిస్తోన్నారు.
పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు విషెస్ తెలియజేస్తోన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, శ్రుతి హాసన్.. సహా పలువురు మంత్రులు, రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలుపుతూ ట్వీట్లు పెడుతున్నారు. టాలీవుడ్ కు చెందిన దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు పవన్ గ్రీటింగ్స్ పంపించారు.

పవన్ కల్యాణ్ అడుగడుగునా సామాన్యుడి పక్షం వహించాడని, అణువణువునా సామాజిక స్పృహను అనుసరించాడని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన మాటల్లో పదును, చేతల్లో చేవ, జన సైన్యానికి ధైర్యం, మాటకి కట్టుబడే తత్వం, రాజకీయాల్లో విలువలకు పట్టం, స్పందించే హృదయం.. అన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానుల, కార్యకర్తల, ప్రజల దీవెనలతో మీరు నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని ఆకాక్షించారు. పవన్ మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలని అన్నారు.
మిత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అడుగడుగునా సామాన్యుడి పక్షం... అణువణువునా సామాజిక స్పృహ... మాటల్లో పదును... చేతల్లో చేవ... జన సైన్యానికి ధైర్యం... మాటకి కట్టుబడే తత్వం... రాజకీయాల్లో విలువలకు పట్టం....స్పందించే హృదయం...అన్నీ కలిస్తే… pic.twitter.com/TqlmiEIwBZ
— N Chandrababu Naidu (@ncbn) September 2, 2025
పాలనలో, రాష్ట్రాభివృద్దిలో పవన్ కల్యాణ్ సహకారం మరువలేనిదని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వెండితెరపై అభిమానులను అలరించిన పవర్ స్టార్, జనహితమే అభిమతంగా రాజకీయాల్లో ప్రవేశించి పీపుల్ స్టార్‌గా ఎదిగారు. ప్రజల కోసం తగ్గుతాడని, ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గి తీరుతాడని, సొంత తమ్ముడు కంటే ఎక్కువగా అభిమానించి, అండగా నిలిచిన పవనన్నకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అని నారా లోకేష్ చెప్పారు.
చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా,
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 2, 2025
ప్రజా జీవితంలో జనసేనాని గా,
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు.
ప్రజా సేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం.
ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు… pic.twitter.com/13gaXFpWsG
పవన్ కళ్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవి ప్రేమపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఓ నోస్టాల్జిక్ ఫొటోను పోస్ట్ చేశారు. సినీ నటుడిగా, జనసేన పార్టీ నాయకుడిగా రెండు పాత్రలను పోషిస్తున్న తీరును ప్రశంసించారు. ప్రజా సేవ పట్ల పవన్ కళ్యాణ్ చూపిస్తున్న అచంచలమైన అంకితభావం చిరంజీవికి మర్చిపోలేనిదని పేర్కొన్నారు.నటుడిగా, ప్రజా జీవితంలో జనసేన నాయకుడిగా, ఉపముఖ్యమంత్రిగా నిరంతరం ప్రజలకు సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications