హైకోర్టు విభజన: ప్రభుత్వాలకు నోటీసులు జారీ
హైదరాబాద్: విభజనపై హైకోర్టు తీవ్రంగా ప్రతిస్పందించింది. హైకోర్టు విభజనకు కొత్త అడ్డంకి ఏర్పడినట్లు కనిపిస్తోంది. హైకోర్టును విభజించాలని ధన్ గోపాల్ రావు అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై ఉమ్మడి హైకోర్టు విచారణ ప్రారంభించింది. తెలంగాణ హైకోర్టును వేరే చోటి ఎలా మారుస్తారని ప్రశ్నించింది.
ఇందుకు సంబంధించి ఇద్దరు ఎమికస్ క్యూరీలను ధర్మాసనం నియమించింది. ఎపిలో హైకోర్టు ఏర్పడిన తర్వాతనే తరలించాలని విభజన చట్టంలో ఉందని వ్యాఖ్యానించింది. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనం ఆడ్వొకేట్ జనరల్‌ను ఆదేశించింది.

కేంద్ర ప్రభుత్వం, ఏపీ, తెలంగాణ రాష్ర్టాల ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విభజనపై లోతైన అధ్యయనం చేయాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో అక్రమ హోర్డింగ్‌లు తొలగించకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదేశాలిచ్చినా అక్రమ హోర్డింగ్‌లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ‘మీకు చేతకాకపోతే మేమే చర్యలు తీసుకుంటాం' అంటూ తీవ్రస్వరంతో వ్యాఖ్యానించింది. ఈ అంశంపై మరో రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని రెండు రాష్ర్టాలను హైకోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications