అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌ సర్కార్‌ మెడకు సరస్వతీ లీజుల పొడిగింపు- రఘురామ పిటిషన్‌పై హైకోర్టు నోటీసులు

|
Google Oneindia TeluguNews

ఏపీలో సీఎం జగన్‌ కుటుంబానికి చెందిన సరస్వతీ పవర్‌కు గుంటూరు జిల్లాలో మైనింగ్ లీజులు పొడిగించడాన్ని సవాల్‌ చేస్తూ వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. దీంతో మైనింగ్‌ లీజుల వ్యవహారం పలు ప్రభుత్వ శాఖలకు చుట్టుకున్నట్లయింది.

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు చెందిన సరస్వతీ పవర్‌.. తనపై గతంలో దాఖలైన సీబీఐ కేసును ప్రస్తావించకుండా హైకోర్టులో లీజ్ పొడిగింపునకు అనుమతి పొందడాన్ని పిటిషన్‌లో రఘురామ పేర్కొన్నారు. కేసు దాఖలు చేసిన కంపెనీకి లీజు ఎలా పొడిగిస్తారని రఘురామ ఆ పిటీషన్‌లో ప్రశ్నించారు. జగన్ సొంత కంపెనీ కావటంతో అధికారులు నిబంధనలు ఉల్లఘించి అనుమతులు ఇచ్చారని పిటిషన్‌లో రఘురామ పేర్కొన్నారు. సరస్వతి కంపెనీ, పరిశ్రమలశాఖ, మైనింగ్ శాఖ, ఏపీ పొల్యూషన్ బోర్డులను ప్రతివాదులుగా రఘురామ కృష్ణరాజు చేర్చారు

hc notices to ap government and pcb over cm jagans saraswati power leases extention

దీంతో ఇవాళ వీరందరికీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎంపీ రఘురామరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు...
సరస్వతి కంపెనీ, పరిశ్రమలశాఖ, మైనింగ్ శాఖ, ఏపీ పొల్యూషన్ బోర్డులకు నోటీసులు జారీ చేసింది. సరస్వతీ పవర్ మైనింగ్ లీజుల పొడిగింపుపై వివరణ ఇవ్వాలని అందులో హైకోర్టు కోరింది. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది. గతంలో జగన్‌ తండ్రి వైఎస్ అధికారంలో ఉండగా అక్రమాలకు పాల్పడిన వ్యవహారంలో సరస్వతీ పవర్‌పై ఇప్పటికే సీబీఐ కేసులున్నాయి. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవేవీ పట్టించుకోకుండా మైనింగ్‌ లీజులు పొడిగిస్తూ అనుమతులు మంజూరు చేశారు.

English summary
andhrapradesh high court on today issued notices to respondents over cm jagan's own firm saraswati power on extention of leases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X