ఒక్క వేటుతో పది కేసుల ఉపసంహరణా ? ప్రభుత్వ విప్ కేసులో హైకోర్టు ఆశ్చర్యం-నోటీసులు
ఏపీలో సీఎం జగన్ తో పాటు పలువురు వైసీపీ ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసుల్ని ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా సీఎం జగన్ పై దాఖలైన కేసుల్ని ఉపసంహరించిన వ్యవహారంలో హైకోర్టు సుమోటో విచారణ జరుపుతోంది. అదే క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలపై కేసుల ఉఫసంహరణపైనే విచారణ జరుపుతోంది. తాజాగా మరో పిటిషన్ కూడా దాఖలు కావడంతో దీనిపై విచారణ ప్రారంభించిన హైకోర్టు.. ప్రభుత్వం, డీజీపీకి నోటీసులు జారీ చేసింది.

వైసీపీ ఎమ్మెల్యేలపై కేసుల ఉపసంహరణ
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై గత ప్రభుత్వాల హయాంలో నమోదైన కేసుల్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. పలు కేసుల్లో సాక్షాధారాలు లేవని, తప్పుడు కేసులని, దురుద్దేశపూర్వకంగా నమోదు చేశారని ఆరోపిస్తూ వీటిని ఉపసంహరించుకుంది. ఇందుకోసం డీజీపీ ఇచ్చిన రిపోర్టే ఆధారం. డీజీపీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అప్పట్లో ప్రభుత్వం ఈ కేసుల్ని ఉపసంహరించుకుంటూ జీవోలు జారీ చేసింది.. దీంతో సీఎం జగన్ సహా ఆయా ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఊరట దక్కింది. కానీ ఆ తర్వాత హైకోర్టు దీన్ని సీరియస్ గా తీసుకుంది.

సామినేని ఉదయభాను కేసుల ఉపసంహరణ
వైసీపీ ఎమ్మెల్యేలపై దాఖలైన కేసుల్ని గంపగుత్తగా ఉపసంహరించడాన్ని హైకోర్టు గతంలోనే తీవ్రంగా తప్పుబట్టింది. సీఎం జగన్ పై కేసుల్ని ఉపసంహరించుకోవడంపై అయితే సుమోటాగా విచారణ కూడా చేపట్టింది. తాజాగా వైసీపీకి చెందిన జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై గతంలో దాఖలైన కేసుల్ని ఉపసంహరించుకోవడంపై ఏపీ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పిటీషనర్ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదించారు. కేసుల ఉపసంహరణ జీవో సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని, విజయవాడలో ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో ఉన్న పది కేసులనూ.. రాజకీయ కారణాలతో ఉపసంహరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది.

వాదోపవాదనలివే
ఈ పది కేసుల్లో కొన్ని తీవ్రమైన నేర స్వభావం ఉన్న కేసులు సైతం ఉన్నాయని వాదించారు. కాగా.. హోంశాఖ తరపున జీపీ మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. వ్యాజ్యానికి విచారణ అర్హత లేదన్నారు. కేసుల ఉపసంహరణ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జీవో ద్వారా పీపీకి తెలియజేశారన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అధికారాన్ని ఉపయోగించి స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకొని సంబంధిత కోర్టులో దరఖాస్తు చేస్తారన్నారు. ఉపసంహరణకు అనుమతించాలా లేదా అనే దానిపై అంతిమ నిర్ణయం మేజిస్ట్రేట్ దేనని అన్నారు.

ఉదయభాను, డీజీపికి నోటీసులు
ప్రభుత్వ విప్, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై పది కేసుల ఉపసంహరణ కోసం ప్రభుత్వం జారీచేసిన జీవోను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర , జస్టిస్ సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ కేసుపై విచారణ జరిపింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పేర్కొంటూ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీకి నోటీసులు జారీచేసింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
Recommended Video

హైకోర్టు కీలక వ్యాఖ్యలు
వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై కేసుల ఉపసంహరణ విషయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా... అందుకు భిన్నంగా ఉపసంహరణకు ప్రభుత్వమే నిర్ణయించి జీవో ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది. ఒక్క జీవోతో పది కేసులు ఉపసంహరించడంపై హైకోర్టు ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మరోవైపు తీవ్ర నేర స్వభావం ఉన్న కేసులను ఉపసంహరించడంపైనా ఆక్షేపించింది. అనంతరం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం.. కౌంటర్లు వేయాలని ఆదేశించింది. వ్యాజ్య విచారణ అర్హతపై అభ్యంతరం ఉంటే.. ఆ వివరాల్ని కౌంటర్లో పేర్కొనాలని కోర్టు స్పష్టం చేసింది.
-
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications