చంద్రబాబే ముందు: లోకేష్ ఎదుట తండ్రిని ఆకాశానికెత్తిన శివనాడర్

Posted By:
Subscribe to Oneindia Telugu

ఢిల్లీ: హెచ్‌సీఎల్ చైర్మన్ శివనాడర్ శుక్రవారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు అని కొనియాడారు. అందరికంటే ముందే ఐటీ రంగాన్ని ప్రోత్సహించారన్నారు.

జగన్‌ను నమ్మితే, ఇంత పని చేస్తారా: మంత్రి సుజయ కృష్ణ ఆగ్రహం

ఏపీ ఐటీ, పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈ రోజు శివనాడార్‌ను ఢిల్లీలో కలిశారు. నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతిలో అభివృద్ధి గురించి ఆయనకు వివరించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

HCL chairman Shiv Nadar praises AP CM Chandrababu

ప్రభుత్వ రాయతీలు, సింగిల్‌ విండో విధానంలో అనుమతులపై ఆయనకు లోకేశ్‌ వివరించారు. లోకేష్-శివనాడర్ సమక్షంలో ప్రభుత్వం, హెచ్‌సిఎల్ మధ్య ఒప్పందం జరిగింది. హెచ్‌సిఎల్ ఏర్పాటుకు అనుమతి పత్రాలను శివనాడర్ అందించారు.

ఈ సందర్భంగా శివనాడార్‌ మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ రంగాన్ని ఎంతగానో ప్రోత్సహించారన్నారు. ప్రపంచవ్యాప్తంగా పర్యటించి అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఐటీహబ్‌గా మార్చారన్నారు.తాను చంద్రబాబును కలిసిన ప్రతిసారీ రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి గురించే మాట్లాడేవారని గుర్తుచేసుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
HCL chairman Shiv Nadar praises Andhra Pradesh CM Chandrababu Naidu.
Please Wait while comments are loading...