ఎండ దెబ్బకు జనం మాడి మసి..!!

అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత సెగలు పుట్టిస్తోంది. పగటి ఉష్ణోగ్రత 45 డిగ్రీలను దాటుతోంది. వడగాలులు దీనికి తోడయ్యాయి. ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఎండ దెబ్బకు మాడి మసి అవుతున్నారు. సూర్యాస్తమయం తరువాత కూడా వేడి తగ్గట్లేదంటే పగటి ఉష్ణోగ్రత తీవ్రత ఏ స్థాయింలో ఉంటోందో అర్థం చేసుకోవచ్చు. ఇదే పరిస్థితి 18వ తేదీ వరకు ఉంటుందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

మోచా తుఫాన్ ప్రభావం (ఆఫ్టర్ సైక్లోన్) వల్ల ఎండ తీవ్రత పెరిగినట్లు వాతావరణ నిపుణులు అంచనా వేశారు. తుఫాన్ తరువాత గాలిలో తేమ శాతం గణనీయంగా తగ్గిందని, వాతావరణం పొడిగా మారినట్లు చెబుతున్నారు. ఫలితంగా ఈ నెల 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కోస్తాంధ్రాలో గరిష్ఠంగా 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుందని పేర్కొన్నారు. వారి అంచనాలు తప్పలేదు.

Heatwave in Andhra Pradesh and Telangana

సముద్ర ఉపరితలం మీది నుంచి వేడి గాలులు వీస్తోన్నాయి. ఎన్టీఆర్, ఏలూరు, ఉమ్మడి గోదావరి, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, కడప, కాకినాడ వంటి జిల్లాల్లో వేడిగాలుల ప్రభావం అధికంగా ఉంటోంది. 24 గంటల్లో అత్యధిక పగటి ఉష్ణోగ్రత ప్రకాశం జిల్లా తర్లుపాడులో నమోదైంది. ఇక్కడ ఎండ తీవ్రత 46.05 డిగ్రీలకు చేరింది. కృష్ణాజిల్లా కోడూరు, ప్రకాశం జిల్లా మద్దిపాడు, గుంటూరు జిల్లా పొన్నూరు, పల్నాడు జిల్లా రావిపాడుల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత రికార్డయింది.

ఏలూరు- ఆగిరిపల్లి, తూర్పు గోదావరి- గోపాలపురం, రాజానగరం, బాపట్ల- కొప్పెరపాడు, కాకినాడ- ఏలేశ్వరం, గుంటూరు- తాడికొండ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ- రామచంద్రాపురం, ప్రకాశం- కురిచేడుల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే జిల్లాలోని కొనకనమిట్ల, ఏలూరు-కలపర్రు, కాకినాడ-సామర్లకోట, నంద్యాల- చాగలమర్రి, కోనసీమ- కే గంగవరం, మండపేట, విజయనగరం- బొండపల్లి, గుంటూరు- దుగ్గిరాల వంటి చోట్ల 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది.

కాకినాడ-కాజలూరు, ప్రకాశం- పెద్దారవీడు, ఏలూరు, బాపట్ల- చినగంజాం, ప్రకాశం-త్రోవగుంట, ఎన్టీఆర్- ఇబ్రహీంపట్నం, గుంటూరు- కొల్లిపార, వల్లభాపురంలల్లో 44 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే తీవ్రత ఈ నెల 18వ తేదీ వరకు కొనసాగుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. అత్యంత ప్రమాదకరస్థాయిలో పగటి ఉష్ణోగ్రత నమోదవుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరో 48 గంటల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని, ఉష్ణోగ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మధ్యాహ్న సమయాల్లో ప్రయాణాలు తగ్గించుకోవాలని, అత్యవసరంగా బయటకి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయట తిరగకూడదని సూచించారు. ఈ నెల 18వ తేదీ తరువాత వాతావరణం కొద్దిగా చల్లబడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+