సంక్రాంతి సంబరాలు కష్టమేనా.. దూసుకొస్తున్న "తుఫాన్" !
కొత్తఏడాది వేడుకలు పూర్తి అయ్యి సంక్రాంతి సెలబ్రేషన్స్ కోసం ప్రజలు రెడీ అవుతున్న తరుణంలో వాతావరణ శాఖ కీల అలర్ట్ జారీ చేసింది. పండుగ వేళ దక్షిణాది రాష్ట్రాలపై వాయుగుండం ముప్పు పొంచి ఉందని ప్రకటించింది. వాతావరణ పరిస్థితులు మరింత అనుకూలిస్తే ఈ వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో పండుగ రోజుల్లో వర్షాలు, ఈదురు గాలులు, సముద్రం అలజడి వంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందనని స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం..
కాగా భూమధ్యరేఖ సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బుధవారం నాడు వాయుగుండంగా బలపడగా.. సాయంత్రానికి శ్రీలంకలోని పొట్టువిల్‌కు సుమారు 570 కిలోమీటర్లు, బట్టికోలాకు 620 కిలోమీటర్లు.. తమిళనాడులోని కరైకల్‌కు 990 కిలోమీటర్లు, చెన్నైకి సుమారు 1,140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.

భారత వాతావరణ విభాగం అంచనాల ప్రకారం నేడు ( జనవరి 8, 2026 ) ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని చెబుతున్నారు. అనంతరం తదుపరి 48 గంటల్లో ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతుందని తెలిపింది. వాయుగుండం తీవ్రత పెరిగితే తుపానుగా మారే ఛాన్స్ ఉందన్నారు. దాంతో శుక్రవారం నుంచి ఆదివారం వరకు శ్రీలంకతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నీటమునిగే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లో వర్ష సూచన..
వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పైనా పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (SDMA) తెలిపింది. శని, ఆదివారాల్లో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రైతులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాయుగుండం నేపథ్యంలో సముద్రం అలజడిగా మారే అవకాశం ఉండటంతో విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు ఒకటో నంబరు హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
సాధారణంగా డిసెంబర్ 31తో ఈశాన్య రుతుపవనాల సీజన్ ముగుస్తుంది. వాతావరణ శాస్త్రం ప్రకారం జనవరి, ఫిబ్రవరి నెలల్లో బంగాళాఖాతంలో వాయుగుండాలు, తుపాన్లు చాలా అరుదుగా ఏర్పడతాయి. అయినప్పటికీ ఈసారి అసాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు అంటున్నారు.
అప్రమత్తత అవసరం
పండుగ వేళ ప్రజలు ప్రయాణాలు, వేడుకల్లో నిమగ్నమయ్యే సమయంలో వాతావరణ మార్పులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications