'దిత్వా' తుఫాను టెన్షన్- ఆ జిల్లాల్లో మేఘాలు బద్దలు, తాజా హెచ్చరికలు..!!

రాష్ట్రం వైపు మరో తుపాను దూసుకొస్తోంది. 'దిత్వా' తుఫాను ముప్పు రాష్ట్రానికి పొంచి ఉంది. దీని వల్ల కోస్తా, రాయలసీమల్లో తీవ్ర ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పలు జిల్లాల్లో 20 సెంటీ మీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం వాయుగుండగా, ఆ తర్వాత కొద్దిగంటల్లోనే తీవ్ర వాయుగుండంగా అనంతరం తుఫాన్‌గా మారింది. ఇది 30 ఉదయం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటనుంది. పలు జిల్లాలకు దీని ప్రభావం పై వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది.

దిత్వా తుఫాను గంటకు 10 నుంచి 15 కి.మీ వేగంతో ఉత్తర వాయవ్యంగా పయనిస్తోంది. ఈ నెల 30వ తేదీ ఉదయానికి తమిళనాడు, కోస్తాంధ్ర తీరాల వైపు రానుందని ఐఎండీ తెలిపింది. పలు వాతావరణ మోడళ్ల మేరకు 30 ఉదయం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావం కోస్తాలో కోనసీమ జిల్లా నుంచి నెల్లూరు వరకూ, రాయలసీమలో కొన్ని జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. శుక్రవారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ వర్షాలు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయి. శనివారం రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల వర్షాలు.. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో అతిభారీ, ప్రకాశం, బాపట్ల, కడప, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Heavy rain and red alerts are issued for AP as cyclone Ditwah approaches 29th

కాగా, తుఫాన్‌ తీరం దాటే సమయంలో(ఆదివారం) రాష్ట్రంలో అనేకచోట్ల వర్షాలు.. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల్లో కొన్నిచోట్ల కుంభవృష్టిగా, బాపట్ల, పల్నాడు, గుంటూరు, నంద్యాల జిల్లాల్లో అతిభారీగా, కృష్ణా, ఎన్టీఆర్‌, పశ్చిమగోదావరి, కర్నూలు, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల వర్షాలు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అతిభారీ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, పల్నాడు, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కోస్తాలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబరు ప్రమాద సూచిక ఎగురవేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. శుక్రవారం నుంచి కోస్తాంధ్రలో తీరం వెంబడి గాలుల వేగం పెరగనున్నది. శనివారం నుంచి తీరం వెంబడి గంటకు 60 నుంచి 70, అపుడప్పుడు 80 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+