తిరుమలలో తెరిపిలేని వర్షం: బెజవాడ జలమయం

Heavy rain at Vijayawada and Tirumala
తిరుమల/ విజయవాడ: తిరుమలలో ఎడతెరపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వాతావరణంలో మార్పులు సంభవించి చల్లని గాలులు వీస్తున్నాయి. వర్షం, చలిలో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వ్యాపారులు దుకాణాలను మూసివేశారు. అటు తిరుపతిలోనూ వర్షం పడుతోంది.

కనుమ రహదారుల్లో నిరాకటంకంగా కురుస్తున్న వర్షంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వామి వారి దర్శనం పూర్తయిన యాత్రికులు ఆలయం నుంచి వర్షంలో తడుస్తూనే గదులకు చేరుకుంటున్నారు. పిల్లలు, వృద్ధులు చలికి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. కనుమ రహదారుల్లో కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఇదిలావుంటే, విజయవాడ నగరంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదాపు రెండు గంటలుగా ఎడపతెరపి లేకుండా కురిసిన వర్షాలకు వాహనదారులు ఇక్కట్లకు గురయ్యారు. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిశాయి. మరో రెండు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు ప్రకాశం జిల్లాలో వర్షాల కారణంగా ఒంగోలు, కందుకూరు, కొండేపి, సంతనూతల పాడు, మార్కాపురం, కనిగిరి తదితర ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+