చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

3,200 మందితో ఒకేసారి చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్: వర్షంతో వణుకు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: భారీ వర్షాల నేపథ్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాల అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. 3200 మందితో సీఎం ఒకేసారి టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షం కారణంగా బుధవారం చిత్తూరు జిల్లా పర్యటనను ముఖ్యమంత్రి చంద్రబాబు రద్దు చేసుకున్నారు.

చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పలు వాగులు పొంగుపొర్లుతున్నాయి. అలాగే, కొన్ని గ్రామాల మధ్య రాకపోకలు బందు అయ్యాయి. నల్లవాగు పొంగుతోంది. మున్నేరు వాగులోకి భారీగా వరద నీరు చేరుతోంది. భారీ వర్షాల కారణంగా ఏపీలో ఒకరు మృతి చెందారు. శుక్రవారం వరకు భారీ వర్షాలు ఉంటాయని చెబుతున్నారు. సూళ్లూరు జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది.

భారీ వర్షాలు

భారీ వర్షాలు

అల్పపీడన ద్రోణి ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా వర్షపాతం నమోదవుతోంది.

భారీ వర్షాలు

భారీ వర్షాలు

ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం వద్ద తూములేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పోకూరు, మాలకొండరాయుని పాలెం మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి.

భారీ వర్షాలు

భారీ వర్షాలు

రాళ్లపాడు జలాశయానికి 11,000 క్యూసెక్కుల వరదనీరు చేరుతుండడంతో ఐదు గేట్లు ఎత్తి అదే స్థాయిలో కిందకి వదులుతున్నారు.

భారీ వర్షాలు

భారీ వర్షాలు

పెదపవని వద్ద ఉప్పుటేరు వాగు ప్రవాహం పెరగడంతో రోడ్డుపైకి నీరు చేరింది. ఉదయం నుంచి ఒంగోలు అద్దంకి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి.

భారీ వర్షాలు

భారీ వర్షాలు

చిత్తూరు, నెల్లూరు జిల్లాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది.

భారీ వర్షాలు

భారీ వర్షాలు

చిత్తూరు జిల్లాలో తిరుపతి సహా తూర్పు మండలాల్లో జోరువాన కురిసింది. సోమ, మంగళవారాల్లో కురిసిన వర్షాలకు తిరుపతిలోని రహదారులు పూర్తిగా చిత్తడిగా మారాయి.

భారీ వర్షాలు

భారీ వర్షాలు

పాదచారులకు, శ్రీవారి భక్తులకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. పలుచోట్ల చెరువులకు గండ్లు పడటంతో వరిపంట నీటమునిగింది.

భారీ వర్షాలు

భారీ వర్షాలు

మల్లిమడుగు రిజర్వాయర్‌లో ఎనిమిది గేట్లు ఎత్తి వరదనీటిని విడుదల చేస్తున్నారు. కల్యాణి డ్యామ్‌లోకి వెయ్యి క్యూసెక్కులమేర నీరు వస్తుండటంతో మధ్య గేట్లు నాలుగు అంగుళాల మేర ఎత్తి నీటిని కల్లేటివాగులోకి విడుదల చేశారు. పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి.

భారీ వర్షాలు

భారీ వర్షాలు

కాళంగి రిజర్వాయర్‌ ప్రమాదపుటంచుల్లో ఉంది. సత్యవేడులో కిరణంబూదూరు, బాలకృష్ణాపురం, పాదిరివేడు చెరువులు ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి.

భారీ వర్షాలు

భారీ వర్షాలు

పుత్తూరు భవానీనగర్‌ పూర్తిగా నీటమునగడంతో వందకుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

భారీ వర్షాలు

భారీ వర్షాలు

సోమశిలలో నీరు 66 టీఎంసీలకు చేరింది. ఇక్కడ నుంచి కండలేరుకు నీరు విడుదల చేస్తున్నారు. అల్లూరులోని ఉలవపాడువద్ద రామన్నచెరువు నిండిపోయి వరదనీరు పొంగిపొర్లడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

భారీ వర్షాలు

భారీ వర్షాలు

దొరవారిసత్రం వద్ద కాళంగినది ఉగ్రరూపంగా ఉంది. నెల్లూరులో సోమవారం 5 సెం.మీ. వర్షం నమోదుకాగా, మంగళవారం 6 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

భారీ వర్షాలు

భారీ వర్షాలు

సర్ణముఖి నదికి వరద ఉద్ధృతి పెరిగింది. కైవల్యా నది పొంగడంతో గూడూరు - రాపూరు, గూడూరు - వెంకటగిరి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

భారీ వర్షాలు

భారీ వర్షాలు

నెల్లూరు జిల్లాలో పంబలేరు వాగు పొంగడంతో గూడూరు మండలం తిక్కవరప్పాడు వద్ద వరద నీరు ప్రవహిస్తోంది. గూడూరు, కావలి, నెల్లూరు నగరంలోని లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలమయమయ్యాయి.

భారీ వర్షాలు

భారీ వర్షాలు

మంగళవారం పలుచోట్ల విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. వరద విపత్తు నివారణ సహాయ బృందాలు చేరుకున్నాయి. సహాయచర్యలు చేపడుతున్నాయి. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

English summary
The low-pressure area may have failed to hatch for a second successive time but that would not prevent the rain from coming down heavily over Tamil Nadu and Puducherry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X