నయనతార భర్తతో 4 ఏళ్ల బంధం.. పాత ప్రేమను గుర్తుచేసుకున్న ప్రముఖ నటి!
తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ నటిగా, ఐటమ్ సాంగ్స్‌తో ఊపేసిన సోనా హేడెన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలను పంచుకుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త, టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న విఘ్నేష్ శివన్‌తో తనకు గతంలో ఉన్న ప్రత్యేక బంధం గురించి ఆమె బయటపెట్టారు. ఒకప్పుడు విఘ్నేష్ శివన్ తన ఆఫీసులోనే కొన్ని ఏళ్ల పాటు పనిచేశాడని.. ఆ సమయంలో తమ మధ్య ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉండేదని చెబుతూ సోనా హేడెన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
నా ఆఫీసులోనే పనిచేశాడు.. అతనితో ప్రేమలో పడ్డాను!
విఘ్నేష్ శివన్ సినిమా కెరీర్ ప్రారంభంలో పడిన కష్టాలను గుర్తుచేస్తూ సోనా హేడెన్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. "విఘ్నేష్ శివన్ దాదాపు మూణ్ణాలుగేళ్ల పాటు నా ఆఫీసులోనే పనిచేశాడు. ఆ సమయంలో విఘ్నేష్ నాకు ఎంతో సహాయం చేశాడు. మేము చాలా క్లోజ్ అయ్యాం. నిజం చెప్పాలంటే నేను విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడ్డాను. మా మధ్య ఓ ప్రత్యేకమైన బంధం ఉండేది. కానీ ఆ తర్వాత ఎలాంటి గొడవలు లేకుండానే అతను నా నుంచి దూరంగా వెళ్లిపోయాడు. ఆ తర్వాత జీవితాలు మారిపోయాయి, బహుశా అతను నన్ను మర్చిపోయి ఉంటాడు. అంత మాత్రాన విఘ్నేష్ చెడ్డవాడని నేను అనను, అతను చాలా మంచి వ్యక్తి" అని సోనా హేడెన్ పేర్కొంది.

నయనతార అంటే నాకు ఎంతో గౌరవం: సోనా హేడెన్
నయనతారపై తనకున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సోనా హేడెన్ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. "విఘ్నేష్ భార్య నయనతారపై నా మనసులో ఎంతో గౌరవం ఉంది. ఓ నటిగా ఆమె సాగించిన ప్రయాణం, కష్టపడే తత్వం నాకు బాగా నచ్చుతాయి. నేను కూడా ఒక మహిళనే. నా జీవితంలో నేను ఎలాంటి విమర్శలను, ఇబ్బందులను ఎదుర్కొన్నానో.. నయనతార కూడా తన కెరీర్‌లో అలాంటి ఎన్నో కష్టాలను, ఒత్తిడిని భరించింది. అందుకే ఆమె జర్నీని నేను ఎల్లప్పుడూ అభినందిస్తాను" అని సోనా హేడెన్ చెప్పుకొచ్చింది. తాను అందరినీ అంత సులభంగా నమ్మనని, కానీ తన జీవితంలో మనసు విప్పి మాట్లాడిన అతికొద్ది మందిలో విఘ్నేష్ శివన్ ఒకరని సోనా హేడెన్ గుర్తుచేసుకున్నారు.
నా జీవితంపై త్వరలోనే బయోపిక్: సోనా హేడెన్
తన పర్సనల్ లైఫ్, భవిష్యత్తు ప్రణాళికల గురించి సోనా హేడెన్ చివరిగా ఓ ఇంట్రెస్టింగ్ లీక్ ఇచ్చారు. "నా జీవితంలో జరిగిన సంఘటనలు ఎవరికైనా ఊరికే చెప్పేసేవి కావు. అందుకే నా జీవిత కథ ఆధారంగా త్వరలోనే ఒక బయోపిక్ నిర్మించబోతున్నాను. నా గురించి ప్రజలకు తెలిసిన విషయాలు వేరు.. నా బయోపిక్‌లో నేను చెప్పబోయే నిజాలు వేరు. రహస్యాలను ఎలా దాచాలో నాకు బాగా తెలుసు, ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువ చెప్పలేను" అంటూ సోనా హేడెన్ ముగించింది. కాగా సోనా హేడెన్ చివరిగా 2024 లో వచ్చిన 'భూమర్ అంకుల్' సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. మరోవైపు విఘ్నేష్ శివన్ మొదట శింబు 'పోడా పోడి' సినిమాతో దర్శకుడిగా మారి.. ఆ తర్వాత నయనతారతో చేసిన 'నానుమ్ రౌడీ దాన్' సినిమాతో ఆమెకు లైఫ్ పార్ట్‌నర్ అయ్యారు.












Click it and Unblock the Notifications