ఉదయాన్నే 20 మిలీ ఈ జ్యూస్ తాగండి - షుగరు సహా ఇవన్నీ కంట్రోల్..!!
ఉసిరి రసం పలు ఆరోగ్య సమస్యల పరిష్కారినికి ఒక వరం. ఈ రసంలో రసంలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఉసిరి రసం ప్రతీ రోజు 50 ఎంఎల్ తీసుకోవటం ద్వారా ఎన్నో దీర్ఘ కాలిక సమస్యలు నియంత్రణలో ఉంటాయి. ఆజీర్తి, గుండె సంబంధిత సమస్యలు, షుగర్ లెవల్స్ తో పాటుగా కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జుట్టు నల్లగా మార్చటానికి సహకరిస్తుంది. దీంతో పాటుగా ఎన్నో ప్రయోజనాలు తులసి రసం ద్వారా అందుతాయి.
ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. పోషకాల శోషణ సామర్థ్యం మెరుగుపడుతుంది. దీంతో పోషకాల లోపం దరి చేరదు. ఉసిరి రసంలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని బలంగా మార్చుతుంది. ఉసిరి రసం తాగితే సీజనల్ ఇన్ఫెక్షన్ల రిస్క్ తగ్గుతుంది. ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగడం వల్ల జీర్ణ స్రావాల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో జీర్ణ సమస్యలు రావు. మలబద్దకం, అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి. ఉసిరి తింటే చర్మం ఎలాస్టిసిటీ పెరుగుతుంది. దీంతో ముడతలు తగ్గుతాయి. జుట్టును వేర్ల నుండి సహజంగా నల్లగా మార్చడానికి సహాయపడుతుంది.















Click it and Unblock the Notifications