మమత క్యాంపు ఖాళీ, ఎంపీ..ఎమ్మెల్యేలు జంప్ - సువేందు చావు దెబ్బ..!?
బెంగాల్ రాజకీయాల్లో సంచలనం. మమతను ఎన్నికల్లో ఓడించిన బీజేపీ.. ఇప్పుడు టీఎంసీ లక్ష్యం గా పావులు కదుపుతోంది. మమతకు ఇప్పటి వరకు వెన్నంటి ఉన్న నేతల పైన ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తోంది. టీఎంసీకి చెందిన ఎంపీలు.. ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. దీంతో.. పార్లమెంట్.. అసెంబ్లీలోనూ మమత తన బలం కోల్పోయే అవకాశం ఉంది. మారుతున్న పరిణామాలతో మమత క్యాంపు అలర్ట్ అయింది.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీఎంసీకి చెందిన దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, బీజేపీ కేంద్ర నాయకత్వం పచ్చజెండా ఊపితే వారంతా కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖన్ సంచలన ప్రకటన చేశారు. ఒకవేళ వీరందరినీ చేర్చుకోవాలని బీజేపీ నిర్ణయిస్తే తృణమూల్ కాంగ్రెస్ ఒక రాజకీయ శక్తిగా ఉనికినే కోల్పోతుందని ఆయన పేర్కొన్నారు. అయితే, సౌమిత్ర ఖన్ చేసిన ఈ వ్యాఖ్యలను తృణమూల్ సీనియర్ ఎంపీ సౌగతా రాయ్ పూర్తిగా ఖండించారు. ఇదే సమయంలో సౌమిత్ర ఖన్ టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాపం చేసిన వారు జైలుకు వెళ్లక తప్పదని వ్యాఖ్యానించారు.

మమత పునాదుల పై బీజేపీ గురి
ప్రస్తుతం ఆయన ఇంటి ముందు బుల్డోజర్ సిద్ధంగా ఉందని, గతంలో బీజేపీ కార్యకర్తల ఇళ్లను కూల్చివేయించినందుకు ఆయన తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు మండుతున్నాయి. అవినీతి ఆరోపణలు, అంతర్గత విబేధాల నడుమ బారాసత్ టీఎంసీ ఎంపీ కాకొలి ఘోష్ దస్తీదార్, ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశానికి హాజరుకావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవల లోక్‌సభలో టీఎంసీ చీఫ్ విప్ పదవి నుంచి తొలగించిన కాకొలి ఘోష్, ఆ తర్వాత బారాసత్ పార్టీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆమెకు వై-కేటగిరీ భద్రతను కల్పించడం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీలకు చెందిన దాదాపు 100 మంది కౌన్సిలర్లు ఇటీవల రాజీనామా చేయడం తృణమూల్ పునాదులను కదిలిస్తోంది. సువేందుకు రాజకీయ వ్యూహాలను టీఎంసీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.













Click it and Unblock the Notifications