చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారీ వర్షాలు: పట్టాలు తప్పిన రైలు, తిరుపతిలో అద్భుత దృశ్యం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభిస్తోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కూలీలు వరద నీటిలో చిక్కుకున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో కొద్దిరోజులుగా విస్తృతంగా వర్షాలు పడడంతో వాగులు, వంగలు పొంగి పొర్లుతున్నాయి.

దొరవారిసత్రం మండలం వెదురుపట్టు వద్ద పాలకాల్వలో పదుల సంఖ్యలో కూలీలు, కుప్పిరెడ్డిపాలెం వద్ద పొంగిన వాగులో ముగ్గురు కూలీలు చిక్కుకున్నారు. వీరంతా సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. తడ మండలంలో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలుచోట్ల రాకపోకలు స్తంభించాయి.

ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వద్ద జాతీయరహదారిపై వస్తున్న ఇంజనీరింగ్‌ కళాశాల బస్సు కాళంగి వరద నీటిలో చిక్కుకుంది. బస్సులోని విద్యార్థులను వారిని రక్షించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. రెవెన్యూ అధికారులతో పాటు ప్రత్యేక పోలీసు బలగాలు వారిని బయటకు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు.

చేజర్ల మండలం నాగులవెల్లటూరు వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగునీటిలో ఇద్దరు వ్యక్తులు, 150 గొర్రెలు చిక్కుకున్నాయి. వీటిని కాపాడేందుకు యత్నిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ మంగళవారం ప్రకటించింది.

తిరుపతి ఎక్స్‌‍ప్రెస్... విశాఖ - తిరుపతి, కోరమండల్ ఎక్స్‌‍ప్రెస్... మద్రాస్ - హౌరా, బొకారో ఎక్స్‌‍ప్రెస్... అలెప్పి - ధన్‌బాద్, చెన్నై సెంట్రల్ - కాకినాడ పోర్ట్ ఎక్స్‌‍ప్రెస్, గంగా కావేరీ ఎక్స్‌‍ప్రెస్... చెన్నై సెంట్రల్ - చప్రా, చెన్నై సెంట్రల్ - పూరీ ఎక్స్‌ప్రెస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

భారీ వర్షం

భారీ వర్షం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తమిళనాడుతో పాటు పక్కనే ఉన్న చిత్తూరు జిల్లాలో వరదలు ముంచెత్తాయి. గతవారం రోజులుగా కురుస్తున్న వానలతో జిల్లాలోని జలాశయాలు దాదాపు నిండే పరిస్థితి ఏర్పడింది.

భారీ వర్షం

భారీ వర్షం

రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండడంతో చిత్తూరు జిల్లాలోని దాదాపు అన్ని ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయి. చిత్తూరు జిల్లాలో 30 టిఎంసిల సామర్థ్యం గల జలాశయాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే 26 టిఎంసిల వరద నీరు జలాశయాలకు వచ్చి చేరాయి.

భారీ వర్షం

భారీ వర్షం

స్వర్ణముఖి నది 20 ఏళ్ల తరువాత వరద ఉదృతి కనిపిస్తుంది. సుమారు 54వేల క్యూసెక్‌ల వరద నీరు స్వర్ణముఖి నదిలో ప్రవహిస్తున్నది. గార్గేయనది ఉద్ధృతితో సోమల తదితర ప్రాంతాల్లోని అన్ని చెరువులు నిండాయి. 910 ఎంసిఎప్‌టిల సామర్థ్యం గల కల్యాణి డ్యాంకు 370 ఎంసి ఎప్‌టిల వరదనీరు వచ్చి చేరింది.

భారీ వర్షం

భారీ వర్షం

కల్యాణి డ్యాం మినహా జిల్లాలోని అన్ని డ్యాంలు పూర్తిగా నిండాయి. 199.39 ఎంసిఎప్‌టిల సామర్థ్యం గల కార్వేటినగరం సమీపంలోని కృష్ణాపురం రిజర్వాయర్ పూర్తిగా నిండడంతో రెండు మూడు గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని తరలిస్తున్నారు.

భారీ వర్షం

భారీ వర్షం

కాళంగి రిజర్వాయర్ నీటిని వదలడంతో దిగువ ప్రాంతానికి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతోంది. దీంతో కెవిబిపురం మండలం కోవనూరు వద్ద కాజ్‌వేపై నీళ్లు పొంగి పొర్లుతున్నాయి. బిఎన్ కండిగ ప్రాంతంలో కూడా కాజ్‌వేపై నీళ్లుపొంగి పొర్లుతున్నాయి.

భారీ వర్షం

భారీ వర్షం

పిచ్చాటూరు సమీపంలో ఉన్న 1852 ఎంసి ఎప్‌టిల సామర్థ్యంగల అరణియార్ ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో రెండు గేట్లు ఎత్తివేసి దిగువ ప్రాంతానికి నీటిని వదిలారు. దీంతో పలుచోట్ల రోడ్లపై నీళ్లు ప్రవహిస్తున్నది. అరణియార్ ప్రాజెక్టుల నీటి ఉద్ధృతితో అటు శ్రీకాళహస్తి, కెవిబిపురం మధ్య, పిచ్చాటూరు-కెవిబిపురం మధ్య, బిఎన్ కండిగ-నాగలాపురం మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభిచాయి.

భారీ వర్షం

భారీ వర్షం

కెవిబిపురం మండలంలో నాలుగు చెరువులకు గండ్లు పడ్డాయి. మరో కోటమంగాపురం చెరువు తెగడంతో ఆ నీరు ఆరణియార్ ప్రాజెక్టుకు వచ్చి చేరింది. అలాగే చిత్తూరు సమీపం కలవగుంట వద్ద ఉన్న ఎన్టీఆర్ జలాశయం 15 ఏళ్ల తర్వాత పూర్తిగా నిండడంతో ఏడు గేట్లు ఎత్తి వేశారు. దీంతో వరద నీరు రోడ్లపై ప్రవహిస్తున్నది. ఈ కారణంగా పెనుమూరు-చిత్తూరు మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

భారీ వర్షం

భారీ వర్షం

సదాశివకోన, బాహుదా తదితర ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి. జిల్లాలోని 8వేల చెరువుల్లో దాదాపు 3వేల చెరువులు పొంగి పొర్లుతున్నాయి. సోమవారం రాత్రి కూడా ఇలాగే వర్షం వస్తే దాదాపు జిల్లాలోని 8వేల చెరువులు కూడా పొంగి పొర్లే పరిస్థితి నెలకొని ఉంది. జిల్లాలో సుమారు 2వేల చెక్‌డ్యాంలు, ఊట చెరువులు, కల్వర్టులు, కాలువలు, వంకలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి.

భారీ వర్షం

భారీ వర్షం

విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు వర్షపు నీటితో పొంగుపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ జైన్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ అంటువ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా, భారీ వర్షాల వల్ల కపిల తీర్థం వద్ద నీళ్లు పొంగుతున్న దృశ్యం

కపిల తీర్థం

కపిల తీర్థం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, ఎస్పీఎస్ నెల్లూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కపిల తీర్థం వద్ద నీరు పొంగుతున్న దృశ్యం.

కపిల తీర్థం

కపిల తీర్థం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల వల్ల ఏపీలో ఐదుగురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. కపిల తీర్థం వద్ద నీరు పొంగుతున్న దృశ్యం.

వర్షాలు

వర్షాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల ఐదుగురు మృతి చెందారు. తమిళనాడుతో పాటు ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, కడప, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వందలాది పశువులు మృతి చెందాయి. పదుల కొద్ది ఇళ్లు ధ్వంసమయ్యాయి.

వర్షాలు

వర్షాలు

మూడో రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా తడిసి ముద్దయింది. వరద నీరు కారణంగా నెల్లూరు - ముంబై జాతీయ రహదారికి గండి పడింది. నెల్లూరు - చెన్నైలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆయా జిల్లాల్లో పదుల సంఖ్యలో చెరువులకు గండ్లు పడ్డాయి.

కాగా, కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మంటపల్లి వద్ద గౌహతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ప్రయాణీకులకు ఎవరికీ గాయాలు కాలేదు. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా తిరుమలలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

ఇదిలా ఉండగా, తమిళనాడు రాజధాని చెన్నై వర్షాలతో అతలాకుతలం అవుతోంది. సోమవారం నాడు వర్షాలతో చెన్నై నీట మునిగింది. కొన్ని చోట్ల దాదాపు బస్సులు పూర్తిగా మునిగిపోయాయి. ప్రజలను పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

English summary
Heavy rains in coastal Andhra Pradesh, Tirupati pilgrims affected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X