హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పొంగిన మూసీ, హిమాయత్‌సాగర్‌కు జలకళ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని జలాశయాలు నిండుకుండలా మారిపోయాయి. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ జలాశయాలకు జలకళ వచ్చేసింది. హిమాయత్‌సాగర్ నీటి మట్టం ఆదివారం నాటికి 1,753 అడుగులకు చేరుకుంది. ఈ జలాశయం గరిష్ట నీటి మట్టం 1,763 అడుగులు. మరో 24గంటలపాటు ఇదే విధంగా వర్షం కురిస్తే నీటి మట్టం 1,760 అడుగులకు చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జలాశయం గేట్లు ఎత్తివేసేందుకు ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెప్పారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. దీనిపై ఆయా ప్రాంతాల అధికారులకు సమాచారం అందించారు.

శంకర్‌పల్లి సమీపంలోని మూసీనది బ్రిడ్జిపై వరదనీరు రావడంతో ఆదివారం ఉదయం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. మధ్యాహ్నం నీరు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఆటోలు, కార్లు, లారీలు మెల్లగా ప్రయాణించాయి. చేవెళ్ల నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నీటి తాకిడికి నీళ్లలో పడిపోగా ఈత కొడుతూ ఒడ్డుకురాగా బైక్ నీటిలో కొట్టుకుపోయింది.

వరదవల్ల మండలంలోని సగం గ్రామాలకు ప్రజా సంబంధాలు తెగిపోయాయి. చేవెళ్లనుంచి వచ్చే వాహనాలు బ్రిడ్జివద్ద ఆగిపోగా, శంకర్‌పల్లి నుంచి వెళ్లే వాహనాలు ఆగిపోయాయి. దీంతో ఇరువైపులా సుమారు 3 కి.మీ మేర ట్రాఫిక్ స్తంభించడంతో మహిళలు, వృద్ధులు ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇన్నేళ్లయినా ఇంకా బ్రిడ్జి నిర్మాణం జరగలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హిమాయత్ సాగర్

హిమాయత్ సాగర్

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని జలాశయాలు నిండుకుండలా మారిపోయాయి. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ జలాశయాలకు జలకళ వచ్చేసింది.

పోటెత్తిన మూసీ

పోటెత్తిన మూసీ

హిమాయత్‌సాగర్ నీటి మట్టం ఆదివారం నాటికి 1,753 అడుగులకు చేరుకుంది. ఈ జలాశయం గరిష్ట నీటి మట్టం 1,763 అడుగులు.

పోటెత్తిన మూసీ

పోటెత్తిన మూసీ

మరో 24గంటలపాటు ఇదే విధంగా వర్షం కురిస్తే నీటి మట్టం 1,760 అడుగులకు చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జలాశయం గేట్లు ఎత్తివేసేందుకు ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెప్పారు.

హిమాయత్ సాగర్

హిమాయత్ సాగర్

ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. దీనిపై ఆయా ప్రాంతాల అధికారులకు సమాచారం అందించారు.

ఉస్మాన్ సాగర్

ఉస్మాన్ సాగర్

శంకర్‌పల్లి సమీపంలోని మూసీనది బ్రిడ్జిపై వరదనీరు రావడంతో ఆదివారం ఉదయం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి.

English summary
Raised Flood water in Musi river and Himayat sagar and osman sagar due to Heavy rain on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X