విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారీ వర్షంలో తడిసిముద్దయిన విశాఖ: జలమయం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: నగరం శుక్రవారం కురిసిన భారీ వర్షానికి తడిసి ముద్దయింది. లోతట్లు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండు వేసవిని తలపించిన వాతావరణం శుక్రవారం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం తెల్లారేసరికే ఆకాశమంతా కారుమబ్బులతో కమ్ముకుంది. చిమ్మచీకటి ఆవరించింది. సుమారు ఎనిమిది గంటల సమయానికి అకస్మాత్తుగా వర్షం కురవడం మొదలయింది.

అలా నాలుగ్గంటలు ఎడతెరిపిలేకుండా దంచికొట్టింది. ఈ కుండపోత వర్షానికి నగరంలోని రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రెయిన్లు పొంగిపొర్లాయి. చెత్తా, చెదారం రోడ్లపై పరుగులు తీశాయి. రైల్వే న్యూకాలనీ, జ్ఞానాపురం, చావులమదుం, వెలంపేట, పూర్ణామార్కెట్, రైల్వే స్టేషన్‌రోడ్డు, పాతబస్టాండ్ తదితర ప్రాంతాల్లో వర్షం నీరు భారీగా వచ్చి చేరింది. దీంతో ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్ అయింది.

వాహనాలు చాలాసేపు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. భోరున కురుస్తున్న వానకు వాహన చోదకులు ఎటు వెళ్లాలో తెలియనంత పద్మవ్యూహంలో చిక్కుకున్నారు. మరోవైపు శుక్రవారం ఉదయం 8.30 గంటలకు మొదలయ్యే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే వారు వర్షంలో చిక్కుకున్నారు.

నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద జరిగే కౌన్సెలింగ్ కేంద్రానికి విద్యార్థులు తమ తల్లిదండ్రులతో చేరుకోవడానికి నానా అవస్థలు పడ్డారు. వర్షానికి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడంతో కాసేపు సరఫరాకు అంతరాయమేర్పడింది. ఇక ఉదయమే వర్షం మొదలవడంతో విధుల్లోకి వెళ్లే ఉద్యోగులు, వివిధ పనులపై వెళ్లేవారు, కూలీలు ఎంతో ఇబ్బందులకు గురయ్యారు.

తడిసిముద్దయిన విశాఖ

తడిసిముద్దయిన విశాఖ

విశాఖపట్నం నగరం శుక్రవారం కురిసిన భారీ వర్షానికి తడిసి ముద్దయింది. లోతట్లు ప్రాంతాలు జలమయమయ్యాయి.

తడిసిముద్దయిన విశాఖ

తడిసిముద్దయిన విశాఖ

మండు వేసవిని తలపించిన వాతావరణం శుక్రవారం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం తెల్లారేసరికే ఆకాశమంతా కారుమబ్బులతో కమ్ముకుంది.

తడిసిముద్దయిన విశాఖ

తడిసిముద్దయిన విశాఖ

చిమ్మచీకటి ఆవరించింది. సుమారు ఎనిమిది గంటల సమయానికి అకస్మాత్తుగా వర్షం కురవడం మొదలయింది.

తడిసిముద్దయిన విశాఖ

తడిసిముద్దయిన విశాఖ

అలా నాలుగ్గంటలు ఎడతెరిపిలేకుండా దంచికొట్టింది. ఈ కుండపోత వర్షానికి నగరంలోని రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రెయిన్లు పొంగిపొర్లాయి. చెత్తా, చెదారం రోడ్లపై పరుగులు తీశాయి.

తడిసిముద్దయిన విశాఖ

తడిసిముద్దయిన విశాఖ

రైల్వే న్యూకాలనీ, జ్ఞానాపురం, చావులమదుం, వెలంపేట, పూర్ణామార్కెట్, రైల్వే స్టేషన్‌రోడ్డు, పాతబస్టాండ్ తదితర ప్రాంతాల్లో వర్షం నీరు భారీగా వచ్చి చేరింది. దీంతో ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్ అయింది.

తడిసిముద్దయిన విశాఖ

తడిసిముద్దయిన విశాఖ

వాహనాలు చాలాసేపు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. భోరున కురుస్తున్న వానకు వాహన చోదకులు ఎటు వెళ్లాలో తెలియనంత పద్మవ్యూహంలో చిక్కుకున్నారు.

తడిసిముద్దయిన విశాఖ

తడిసిముద్దయిన విశాఖ

మరోవైపు శుక్రవారం ఉదయం 8.30 గంటలకు మొదలయ్యే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే వారు వర్షంలో చిక్కుకున్నారు.

తడిసిముద్దయిన విశాఖ

తడిసిముద్దయిన విశాఖ

నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద జరిగే కౌన్సెలింగ్ కేంద్రానికి విద్యార్థులు తమ తల్లిదండ్రులతో చేరుకోవడానికి నానా అవస్థలు పడ్డారు.

తడిసిముద్దయిన విశాఖ

తడిసిముద్దయిన విశాఖ

వర్షానికి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడంతో కాసేపు సరఫరాకు తరాయమేర్పడింది.

తడిసిముద్దయిన విశాఖ

తడిసిముద్దయిన విశాఖ

ఇక ఉదయమే వర్షం మొదలవడంతో విధుల్లోకి వెళ్లే ఉద్యోగులు, వివిధ పనులపై వెళ్లేవారు, కూలీలు ఎంతో ఇబ్బందులకు గురయ్యారు.

తడిసిముద్దయిన విశాఖ

తడిసిముద్దయిన విశాఖ

ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం మధ్యాహ్నం 12 గంటలకు తగ్గుముఖం పట్టింది.

తడిసిముద్దయిన విశాఖ

తడిసిముద్దయిన విశాఖ

కుండపోతగా కురిసిన వర్షానికి నగరంలో 9 సెం.మీల వర్షపాతం నమోదయింది.

తడిసిముద్దయిన విశాఖ

తడిసిముద్దయిన విశాఖ

నాలుగు రోజుల క్రితం వేకువజామున కురిసిన వర్షపాతం కూడా 9 సెం.మీలే. అయితే తెల్లారేసరికే తగ్గిపోవడంతో జనానికి వర్షప్రభావం తెలియలేదు. కాగా ఈ భారీ వర్షం నగర పరిధిలోనే అధికంగా ఉంది.

తడిసిముద్దయిన విశాఖ

తడిసిముద్దయిన విశాఖ

కాగా, ఎంసెట్ ఇంజినీరింగు కౌన్సెలింగు శుక్రవారం ఉదయంవిశాఖలోని రెండు కేంద్రాలలో ప్రారంభమైంది.

తడిసిముద్దయిన విశాఖ

తడిసిముద్దయిన విశాఖ

ఆరంభానికి ముందే కుండపోతగా వాన కురిసింది. దీంతో కొంత అంతరాయం ఏర్పడింది.

తడిసిముద్దయిన విశాఖ

తడిసిముద్దయిన విశాఖ

పాలిటెక్నిక్ కళాశాల కేంద్రంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అవస్థలు పడ్డారు. తలదాచుకోవడానికి చోటులేక తడిసి ముద్దయ్యారు.

తడిసిముద్దయిన విశాఖ

తడిసిముద్దయిన విశాఖ

టెంట్‌లు వర్షానికి కూలిపోయి నీడనివ్వలేకపోయాయి. వర్షపు నీరు నిలిచిపోయి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

తడిసిముద్దయిన విశాఖ

తడిసిముద్దయిన విశాఖ

నగరం శుక్రవారం కురిసిన భారీ వర్షానికి తడిసి ముద్దయింది. లోతట్లు ప్రాంతాలు జలమయమయ్యాయి.

తడిసిముద్దయిన విశాఖ

తడిసిముద్దయిన విశాఖ

మండు వేసవిని తలపించిన వాతావరణం శుక్రవారం ఒక్కసారిగా మారిపోయింది.

తడిసిముద్దయిన విశాఖ

తడిసిముద్దయిన విశాఖ

ఉదయం తెల్లారేసరికే ఆకాశమంతా కారుమబ్బులతో కమ్ముకుంది.

తడిసిముద్దయిన విశాఖ

తడిసిముద్దయిన విశాఖ

చిమ్మచీకటి ఆవరించింది. సుమారు ఎనిమిది గంటల సమయానికి అకస్మాత్తుగా వర్షం కురవడం మొదలయింది.

ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం మధ్యాహ్నం 12 గంటలకు తగ్గుముఖం పట్టింది. కుండపోతగా కురిసిన వర్షానికి నగరంలో 9 సెం.మీల వర్షపాతం నమోదయింది. నాలుగు రోజుల క్రితం వేకువజామున కురిసిన వర్షపాతం కూడా 9 సెం.మీలే. అయితే తెల్లారేసరికే తగ్గిపోవడంతో జనానికి వర్షప్రభావం తెలియలేదు. కాగా ఈ భారీ వర్షం నగర పరిధిలోనే అధికంగా ఉంది.

కాగా, ఎంసెట్ ఇంజినీరింగు కౌన్సెలింగు శుక్రవారం ఉదయంవిశాఖలోని రెండు కేంద్రాలలో ప్రారంభమైంది. ఆరంభానికి ముందే కుండపోతగా వాన కురిసింది. దీంతో కొంత అంతరాయం ఏర్పడింది.

పాలిటెక్నిక్ కళాశాల కేంద్రంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అవస్థలు పడ్డారు. తలదాచుకోవడానికి చోటులేక తడిసి ముద్దయ్యారు. టెంట్‌లు వర్షానికి కూలిపోయి నీడనివ్వలేకపోయాయి. వర్షపు నీరు నిలిచిపోయి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

English summary
The unexpected and heavy downpour in the city Friday morning threw life out of gear after overflowing drains inundated low-lying areas and roads turned into rivers. Within a couple of hours the city recorded a whopping 9 cm rainfall.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X