ఏపీకి భారీ వర్ష సూచన-రేపటి నుంచి మూడు రోజుల పాటు కుండపోత
ఏపీలో నైరుతి రుతుపవనాల ప్రభావం కొనసాగుతోంది. అదే సమయంలో బంగాళాఖాతంలోనూ స్ధిరంగా అల్పపీడనాలు ఏర్పడుతుండటంతో దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు రోజుల్లో ఏపీ వ్యాప్తంా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది.
Recommended Video
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల ఏపీలో ఈ నెల 21 నుంచి మూడు రోజు పాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ ప్రకటించింది. ఉపరిత ఆవర్తనం ప్రభావం వల్ల ఉభయ గోదావరి, కృష్ణా మరియు గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు ఉంటాయని వెల్లడించింది.
రాయలసీమ, ప్రకాశం, నెల్లూరులోనూ అక్కడక్కడా వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.

ఏపీలో గత కొన్ని రోజులుగా వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలకు తోడు నైరుతి రుతుపవనాలు కూడా కలిసి రావడంతో రైతులు పంటలు వేసుకునేందుకు వీలు కలుగుతోంది. వర్షాల తీవ్రత కూడా ఎక్కువగా లేకపోవడంతో ఇబ్బందులు కూడా లేవు. ఈ ఏడాది కూడా స్ధిరంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తుపానులు లేకపోవడంతో తీర ప్రాంతాల ప్రజలు కూడా ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈసారి ఉపరితల ఆవర్తనం కారణంగా మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశముంది.
భారీవర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అధికారుల్ని అఫ్రమత్తం చేసింది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో మత్సకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రాబోయే మూడు రోజుల పాటు తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వీటి వల్ల పంటలకు ఎలాంటి నష్టం లేదని వ్యవసాయ అధికారులు కూడా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో స్ధిరంగా వర్షపాతం నమోదైతే ఈ ఏడాది పంటలకు కూడా ఢోకా ఉండకపోవచ్చని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications