ఏపీలోని ఈ జిల్లాల్లో అలర్ట్- భారీ వర్ష సూచన
అమరావతి: వాతావరణ కేంద్రం ఏపీకి భారీ వర్ష సూచన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అటు ఏపీ విపత్తుల నిర్వహణ విభాగం కూడా ప్రజలను అప్రమత్తం చేసింది. కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని తెలిపింది.
విపత్తు నిర్వహణ విభాగం ఇచ్చిన సమాచారం ప్రకారం.. గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. దీని ప్రభావం శనివారం వరకూ ఉండొచ్చు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తా, మధ్య కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి.

గురువారం నాడు పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరుజ జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శుక్రవారం నాడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడొచ్చని విపత్తు నిర్వహణ విభాగం అంచనా వేసింది. ప్
ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రైతులు.. తమ పొలం పనుల్లో ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు రైతులు, వ్యవసాయ కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించింది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
ఈ వర్షాల తీవ్రత శనివారం వరకూ కొనసాగే అవకాశాలు లేకపోలేదు. ఉపరితల ఆవర్తనం బలపడటానికి అనుకూల వాతావరణం ఉన్నందున శనివారం నుంచి రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తెలంగాణలో ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది. ఎల్లో అలర్ట్‌ను సైతం జారీ చేసింది.












Click it and Unblock the Notifications