ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారీ వర్షం, జగన్ ఆఫీస్‌లోకి నీళ్లు: గుంటూరులో పిడుగు పడే ఛాన్స్

ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వరుణుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. రాజధాని అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత కురుస్తోంది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వరుణుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. రాజధాని అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత కురుస్తోంది.

ఏపీ ముందడుగు: పిడుగుపాటును ముందే గుర్తించారు, ఎలాగంటే..ఏపీ ముందడుగు: పిడుగుపాటును ముందే గుర్తించారు, ఎలాగంటే..

భారీ వర్షం కారణంగా వెలగపూడి సచివాలయంలోని నాలుగో బ్లాక్‌లోకి వర్షం నీరు వచ్చింది. ప్రతిపక్ష నేత వైయస్ జగన్ కార్యాలయంలోకి కూడా వర్షపు నీరు సన్నటి ధారగా కారింది.

Heavy rains in Andhra Pradesh guntur

చిత్తూరు జిల్లా తిరుపతి, తిరుమల ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి వీధులన్నీ జలమయమయ్యాయి.

సోమవారం రాత్రి కురిసిన వర్షంతో నీటితో నిండిపోయిన కాల్వలను శుభ్రపరిచేందుకు పారిశుద్ధ్య సిబ్బంది చర్యలు తీసుకుంటుండగా మంగళారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది.

దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈదురుగాలులతో కూడిన ఈ వర్షానికి పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇదిలా ఉండగా, గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి పరిసరాల్లో ఉన్న గ్రామాల్లో పిడుగుపడే అవకాశముందని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరించారు. కృష్ణా జిల్లాలోని గ్రామాల్లో సైతం పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. పిడుగు ఎక్కడ పడుతుందో ఏపీలో ఇటీవల ముందే గుర్తిస్తున్న విషయం తెలిసిందే.

English summary
Heavy rains in andhra Pradesh. Water came into YSR Congress Party chief YS Jaganmohan Reddy's office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X