తుఫాన్ ఎఫెక్ట్, బడులకు సెలవు - ప్రభుత్వం అలర్ట్..!!

బంగాళాఖాతంలో అల్పపీడనం, తుఫాన్ అంచనాల వేళ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా రాయలసీమ జిల్లాలతో పాటుగా నెల్లూరులో వర్షాలు మొదలయ్యాయి. ప్రభుత్వం జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. తిరుపతిలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసారు.

మొదలై వర్షాలు
బంగాళాఖాతంలో అల్ప పీడనం వేళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ఏర్పడిన 48 గంటల్లో తమిళనాడు, దక్షిణకోస్తా వైపు కదిలే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే నెల్లూరుతో పాటుగా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. నెల్లూరు జిల్లాలో అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

Heavy rains in Nellore and Seema Districts Govt Alerts officials

మూడు రోజుల పాటు
నేటి నుంచి బుధవారం వరకు మూడు రోజులపాటు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. భారీ వర్షాలు. తుఫాన్ వచ్చినట్లయితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోడా నికి అధికారులంతా సిద్ధంగా ఉండాలని అప్రమత్తం చేసింది. అల్పపీడనం తదుపరి 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపు కదిలే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్ల రాదని హెచ్చరికలు జారీ చేశారు.

ప్రభుత్వం అప్రమత్తం
బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని అధికారులు అంచనా వేసారు. నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. బుధ, గురు వారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+