బంగాళఖాతంలో వాయుగుండం: ఒడిశాకు ముప్పు, ఉత్తర కోస్తాకు వర్ష సూచన

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖపట్టణం: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వచ్చే 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు గురువారం రాత్రి తెలిపారు.

ప్రస్తుతం మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని, ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు చేరువయ్యే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు.

Heavy rains likely in Odisha from tomorrow due to depression over Bay of Bengal

వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు. మరో వైపు ఒకటిరెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

తీరం వెంబడి ఈశాన్యదిశగా గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. అన్ని పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద సూచీని ఎగుర వేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
More than ten districts of Odisha are likely to be lashed by heavy rains coupled with squally winds from Friday due to a depression over Bay of Bengal.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X