ఏపీకి పొంచి ఉన్న మరో ముప్పు, పలు జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు
విశాఖ: ఏపీకి మరో ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని మంగళవారం నాడు అల్పపీడనం ఏర్పడింది. మరో ఇరవై నాలుగు గంటల్లో ఇది వాయుగుండంగా మారనుందని వాతావరణ విభాగం తెలిపింది.
వాయవ్య దిశగా ఇది పయనిస్తూ మరింత బలపడుతుందని పేర్కొంది. దీని ప్రభావం మూడో తేదీ నుంచి కనిపిస్తుందని, నాలుగో తేది నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. సముద్రం అలజడిగా ఉంటుందని, తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది.

మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలతో పాటు తమిళనాడులో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. బలమైన అల్పపీడన ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.












Click it and Unblock the Notifications