ఆశ్చర్యం: పవన్ కళ్యాణ్ కాకినాడ సభకు ఇంత బందోబస్తా?

కాకినాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాకినాడ సభకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వస్తున్నారు. లక్ష మందికి పైగా తరలి వస్తున్నారు. కాకినాడ జేఎన్టీయూ ప్రాంగణం ఇప్పటికే దాదాపు నిండిపోయింది. నాలుగు గంటలకు అటు ఇటు పవన్ ప్రసంగం ప్రారంభం కానుంది.

పవన్ సభ నేపథ్యంలో పోలీసులు నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు రెండువేల మందితో బందోబస్తును నిర్వహిస్తున్నారు. కాకినాడ జేఎన్టీయూ మైదానంలోను అధిక సంఖ్యలో పోలీసులను మోహరించారు.

రోజా అలా, నేడు మిథున్ రెడ్డి ఇలా: పవన్ కళ్యాణ్‌కు జగన్ దూరం వెనుక

సభా ప్రాంగణాన్ని గురువారం ఏలూరు రేంజ్‌ డీఐజీ రామకృష్ణ, అడిషనల్‌ ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌, జనసేన పార్టీ రాష్ట్ర కోశాధికారి ఎం రాఘవయ్యలతో కలిసి పరిశీలించారు. సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Heavy security for Pawan Kalyan's meeting

ఉభయగోదావరి జిల్లాల నుంచే కాకుండా కృష్ణా, విశాఖ జిల్లాల నుంచి పోలీసులను రప్పించారు. కాకినాడలో జరిగే బహిరంగ సభకు హాజరయ్యేందుకు పవన్ కళ్యాణ్ గురువారం హైదరాబాద్‌ నుంచి మధురపూడి విమానాశ్రయానికి వచ్చారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో ఆయన చేరుకున్నారు.

జిల్లా నలుమూలల నుంచి వచ్చిన జనసేన నాయకులు, కార్యకర్తలు పవన్‌ కళ్యాణ్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక బందోబస్తు మధ్య రోడ్డు మార్గంలో మధురపూడి, బూరుగుపూడి, దోసకాయలపల్లి, నందరాడ, నరేంద్రపురం మీదుగా రాజానగరం చేరుకుని అక్కడ నుంచి కాకినాడ చేరుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+