టీచర్‌గా మారిన కథానాయకుడు బాలకృష్ణ
సీనియర్ కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. సతీసమేతంగా అక్కడికి వెళ్లిన బాలయ్య నియోజకవర్గ ప్రజలకు మెరుగైన ఆరోగ్య వసతి కోసం ఎన్టీఆర్ ఆరోగ్య రథాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. రెండోరోజు సైతం ఆయన పర్యటన కొనసాగింది. హిందూపురం మున్సిపల్ పరిధిలోని కొట్నూరు ఉన్నత పాఠశాలకు హెరిటేజ్ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా ఎల్ఈడీ టీవీలను అందజేశారు.
ఈ సందర్భంగా బాలయ్య అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. ఉపాధ్యాయుడిగా మారిన కథానాయకుడు తనదైన స్టైల్లో విద్యార్థులకు క్లాస్ తీసుకున్నారు. సోషల్ మీడియా వైపు వెళ్లొద్దని, ఫేస్‌బుక్ చూస్తూ కాలం వృథా చేయొద్దంటూ హెచ్చరించారు. తల్లిదండ్రులకు, దేశానికి గుర్తింపు తెచ్చే విధంగా విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరాలని ఆకాక్షించారు. హిందూపురంలో అంధుల పాఠశాలను, నవోదయ విద్యా సంస్థను తెచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకి దక్కుతుందన్నారు.

ప్రస్తుతం బాలయ్య హిందూపురం నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ కొట్టాలని కంకణం కట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఆయన ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. సినిమా షూటింగ్ లకు విరామం దొరికినప్పుడల్లా స్థానికులకు అందుబాటులో ఉంటున్నారు. అందరికీ ఆరోగ్యమస్తు.. ప్రతి ఇంటికి శుభమస్తు.. మన హిందూపురం.. మన బాలయ్య అని ఆరోగ్య రథంపై చిత్రించారు.
-
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..!












Click it and Unblock the Notifications