Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోహన్ బాబు రేర్ ఫోటో: పరిటాల రవి, నెహ్రూలతో.., 'వాళ్లెప్పుడూ నా హృదయంలో'

నటుడు మోహన్ బాబు ట్విట్టర్ లో ఒక అరుదైన ఫోటో పోస్టు చేశారు. దివంగత నేతలు పరిటాల రవి, దేవినేని నెహ్రూలతో దిగిన ఈ ఫోటో నెటిజెన్స్ ను ఆకట్టుకుంటోంది.వాళ్లిద్దరితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ మోహన్ బ

అనంతపురం: దివంగత టీడీపీ నేత పరిటాల రవితో నటుడు మోహన్ బాబుకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పరిటాల రవి మరణానంతరం కూడా ఆ కుటుంబంతో ఆయన అనుబంధం కొనసాగుతూ వస్తోంది.

మంత్రి పరిటాల సునీతను తన సొంత సోదరి లాగే భావిస్తారు మోహన్ బాబు. ఇప్పటికీ పరిటాల కుటుంబానికి సంబంధించి ఏ శుభకార్యమైన మంచు ఫ్యామిలీ ముందుంటుంది. తాజాగా పరిటాల రవితో ఆయన అనుబంధాన్ని మోహన్ బాబు మరోసారి గుర్తుచేసుకున్నారు.

అప్పట్లో దివంగత నేతలు పరిటాల రవి, దేవినేని నెహ్రూలతో దిగిన ఫోటోను ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ ఫోటో సుమారు 20సంవత్సరాల క్రితం తీసుకున్నట్లు తెలుస్తోంది.

'ఎల్లప్పుడూ నా హృదయంలో ఉండే అత్యంత ఆత్మీయ సోదరులు పరిటాల రవి, దేవినేని నెహ్రూ' అని మోహన్ బాబు పేర్కొన్నారు. చేతిలో పుష్పగుచ్చాలు పట్టుకుని ముగ్గురు నిలుచుకున్న ఈ అరుదైన ఫోటో నెటిజెన్స్‌ను ఆకట్టుకుంటోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+