ప్రభాస్ ఫ్యామిలీ మద్దతు వారికే ! నరసాపురంలో నేరుగా ప్రచారంలోకి..
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కు మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్టీల అభ్యర్ధులు హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో ఎన్నికలకు ముందు ఎన్డీయే తరఫున పోటీ చేస్తారని భావించిన ప్రభాస్ కుటుంబ సభ్యులకు సీటు దక్కలేదు. దీంతో వీరు వైసీపీలో చేరి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు కీలకమైన ఎన్నికల సమయంలో వారు స్పందించారు.
నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్డీయే కూటమి తరఫున బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్ధి భూపతిరాజు శ్రీనివాసవర్మకు మద్తతుగా ప్రభాస్ కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. ఎన్డీయే కూటమి లోక్ సభ అభ్యర్ధి అయిన వర్మతో పాటు ఈ లోక్ సభ సీటులో అసెంబ్లీకి పోటీ చేస్తున్న కూటమి అభ్యర్ధులకు సైతం ప్రభాస్ కుటుంబం ప్రచారం చేస్తోంది. నిన్న రాత్రి దివంగత కృష్ణంరాజు భార్య శ్యామలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు నరసాపురంలో ప్రచారం చేశారు.

ఎన్డీయే లోక్ సభ అభ్యర్ధి శ్రీనివాసవర్మతో పాటు నరసాపురం అసెంబ్లీకి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్ధి బొమ్మడి నాయకర్ కు కూడా వారు మద్తతు తెలిపారు. వీరికి ఓట్లు వేసి గెలిపించాలని నియోజకవర్గ ఓటర్లను కోరారు. దీంతో ఈసారి ఎన్నికల్లో ప్రభాస్ కుటుంబం తమకు సీటు దక్కకపోయినా ఎన్డీయే అభ్యర్ధులకు ప్రచారం చేయడం ద్వారా ప్రధాని మోడీపై అభిమానాన్ని చాటుకున్నట్లయింది. దీంతో ఈ ప్రాంతంలో క్షత్రియులతో పాటు కాపుల మద్దతు ఎన్డీయే అభ్యర్ధులకు ప్లస్ అవుతోంది.












Click it and Unblock the Notifications