చంద్రబాబు, జగన్‌ల ఆధిపత్య పోరులో ఏపీ నలిగిపోతుంది: హీరో శివాజీ

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌పై మరోసారి సినీ నటుడు శివాజీ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వీరిద్దరి ఆధిపత్య పోరులో ఏపీ నలిగిపోతుందన్నారు. ఇద్దరూ కలిసి తమ స్వార్ధ రాజకీయల కోసం ప్రజల్ని నాశనం చేస్తున్నారన్నారు.

బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సమాఖ్య కన్వీనర్ కారెం శివాజీ, అధ్యక్షుడు శివాజీ, గౌరవ అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ చందబ్రాబు ఢిల్లీ పర్యటనపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని కాని వాటన్నింటిని పటాపంచలు చేశారని విమర్శించారు.

/news/andhra-pradesh/hero-shivaji-fires-on-ap-cm-chandrababu-naidu-and-ys-jagan-162855.html

చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి సాధించింది ఏమిలేదని, ఆయన పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని విమర్శించారు. యావత్ ఆంధ్ర ప్రజలను అవమాన పరిచే విధంగా కేంద్రం వ్యవహరిస్తుందని చెప్పారు. దేవాలయం లాంటి పార్లమెంట్‌లో ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు.

జగన్, చంద్రబాబు ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తూ ఎవరికి వారు లబ్దికోసం ప్రయత్నించడం బాధాకరమని రాజకీయాలు మాని ప్రజల కోసం చిత్తశుద్దితో పనిచేయాలని కోరారు. ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందని మాట్లాడుతున్నారని ప్యాకేజీల వల్ల నాయకులు లబ్దిపొందుతారు తప్ప ప్రజలకు చేకూరేదేమీ ఉండదని అన్నారు.

/news/andhra-pradesh/hero-shivaji-fires-on-ap-cm-chandrababu-naidu-and-ys-jagan-162855.html

ఇక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేవన్నీ పెయిడ్ ఆందోళనలేనని ఆయన ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా విషయంపై వైసీపీ ఎంపీలు పార్లమెంటులో ఎందుకు మాట్లాడడం లేదని శివాజీ ప్రశ్నించారు. విభజన సమయంలో పార్లమెంట్‌లో ప్రజలకు ఇచ్చిన హామీలను మరవడంతో తాము భారతదేశంలోనే ఉన్నామా అనే అనుమానంతో జీవిస్తున్నారని అన్నారు.

ఈ నేపధ్యంలో కేంద్రం మానవతా దృక్పథంతో హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హోదా సాధించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని అన్నారు.

మోడీ, వెంకయ్య, బాబులపై పీఎస్ లో కేసులు: రఘవీరా

ఏపీ సీఎం చంద్రబాబుపై ఏపీసీసీ చీఫ్ రఘవీరారెడ్డి బుధవారం అనంతపురంలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ పేరుతో చంద్రబాబు ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారని ఆరోపించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను చూసి ఏపీ సీఎం నేర్చుకోవాలని హితవు పలికారు.

సెప్టెంబర్ 7,8,9 తేదీలలో ప్రధాని మోడీ, కేంద్రమంత్రి వెంకయ్య, సీఎం చంద్రబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు పెడతామని స్పష్టం చేశారు.

లక్ష ఎకరాలు లాక్కొని వైయస్ రైతలు పొట్ట కొట్టాడు: బొజ్జల

దీక్షలు, ధర్నాలతో వైయస్ జగన్ దీవాళాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నారని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లక్ష ఎకరాలు లాక్కొని వైయస్ రైతలు పొట్ట కొట్టాడన్నారు. ఏపీ రాజధాని నిర్మాణం పూర్తయితే వైసీపీ అడ్రస్ ఉండదనేది జగన్ భయమన్నారు.

పట్టిసీమ, రాజధాని విషయంలో జగన్ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ముడుపుల కోసమే పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిందని జగన్ అనడం హాస్యాస్పదమన్నారు. బీజేపీ, టీడీపీ మైత్రిని చెడగొట్టి బీజేపీతో పొత్తుకు జగన్ ఆరాటపడుతున్నారన్నారు.

గ్రామ కంఠాలను పరిశీలిస్తున్న మంత్రి నారాయణ

నవ్యాంధ్ర రాజధానిలో నీరుకొండ గ్రామంలోని గ్రామ కంఠాలను మంత్రి నారాయణ బుధవారం పరిశీలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+