వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతి డబ్బుతో మంత్రులు విలాసాలు.. నానికి బాసటగా సిద్ధార్థ్.. జ‌గ‌న్ స‌ర్కార్‌పై సెటైర్లు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధర వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపుతోంది. అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అటు టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు, థియేటర్స్ యజమాన్యాలు సైతం జగన్ ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. టీ కప్పు కూడా రాని ధరకు సినిమా టికెట్ ధరను ఫీక్స్ చేశారంటూ మండిపడుతున్నారు. శ్యామ్ సింగరాయ్ మీడియా సమావేశం సందర్భంగా ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపుపై హీరో నాని అసహనం వ్యక్తం చేశారు. దీనిపై మంత్రులు సైతం నానికి కౌంటర్ ఇచ్చారు. అయితే నాని వ్యాఖ్యలను సమర్థిస్తున్న‌ట్లుగానే.. తాజాగా హీరో సిర్థార్థ్ మంత్రులపై సెటైర్లు విసిరారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమైయ్యాయి.

విలాసాలు త‌గ్గించి.. మాకు స‌బ్సిడీలు ఇవ్వండి..


ఏపీలో సినిమా టికెట్ ధ‌ర‌ల త‌గ్గింపుపై ట్విట్టర్ వేదికగా హీరో సిద్ధార్థ్ విరుచుపడ్డారు. సినిమా ఖర్చు తగ్గించి , కస్టమర్స్‌కు డిస్కౌంట్ అందిస్తున్నామంటున్నారు మంత్రులు. కాని సినీ పరిశ్రమలో పనిచేసే మేమంతా ప్రభుత్వానికి లెక్కలతో సహా చూపించి పన్నులు కడుతున్నానామన్నారు. రాజకీయ నేతల మాత్రం ఎలాంటి టాక్స్ లు లేకుండా విచ్చలవిడిగా సంపాదిస్తున్నారు. దుర్మార్గంగా ప్రజల డబ్బులను దోచుకుంటున్నారు.. అవితీతి చేసి లక్ష‌ల కోట్లు సంపాధించుకుంటున్నారని ఆరోపిస్తూ ట్విట్ చేశారు. కానీ మేము ప్రతిది లెక్క చూపించి టాక్స్ కడుతున్నామన్నాం.. మీ విలాసాలను కొస్త తగ్గించుకోనీ మాకు సబ్సిడీలు ఇవ్వండి అంటూ ట్విట్ చేశారు సిద్ధార్థ్.

 ఏ మంత్రుల గురించి..

ఏ మంత్రుల గురించి..

అయితే సిద్ధార్థ్ తన ట్వీట్‌లో ఏ మంత్రుల గురించి అంటున్నది ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ప్రస్తుతం ఏపీలో సినిమా టికెట్ల రేటు వివాదం నడుస్తోంది. సినీ పరిశ్రమలోని పలువురు జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌పై విమర్శలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో సిద్ధార్థ కూడా ఏపీ మంత్రులనే ఉద్దేశించి మాట్లాడని నెటిజన్లు ఆయనకు రీ ట్విట్ చేస్తున్నారు.

 నాని వర్సెస్ మంత్రులు

నాని వర్సెస్ మంత్రులు


శ్యామ్ సింగరాయ్ మీడియా సమావేశంలో హీరో నాని ఏపీలో టికెట్ ధర తగ్గింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు . ప్రభుత్వ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు అనే విషయాన్ని పక్కన పెడితే టికెట్ల ధర తగ్గింపు ప్రేఓకుల్ని అవమానించేలా ఉందన్నారు. థియేటర్ల కంటే పక్కన ఉండే కిరాణా షాపుల కలెక్ష‌న్ ఎక్కువగా ఉన్నాయన్నారు. సినిమా టికెట్ల ధరలు పెంచినా ప్రేక్ష‌కులకు కొనే సామర్థం ఉందని పేర్కొన్నారు

 మంత్రులు కూడా కౌంటర్

మంత్రులు కూడా కౌంటర్

నాని వ్యాఖ్యలపై అటు మంత్రులు కూడా కౌంటర్ ఇచ్చారు. సినిమా టిక్కెట్ల ధరలను అడ్డగోలుగా పెంచడం సరికాదని మంత్రి బొత్స అన్నారు. స‌బ్బులు, బిస్కెట్లకు ఎమ్మార్పీ రేట్లు ఉన్న‌ప్పుడు సినిమా టికెట్ల‌కు ధ‌ర ఉంటే త‌ప్ప ఏమిట‌ని మంత్రులు నిల‌దీశారు. అందరి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉంటుందని మంత్రులు పేర్కొన్నారు. ఏమైనా అభ్యంతరాలుంటే ప్ర‌భుత్వానికి తెలియ‌జేయాల‌ని థియేట‌ర్ల యాజ‌మాన్యాల‌కు సూచించారు. మ‌రి సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై మంత్రులు ఏలా స్పందిస్తారో చూడాలి.

English summary
Actor Siddharth Sansatonal comments on ap minister over cinema ticket rates issue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X