Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సిగ్గుండాలి..వెళ్లి పడుకో: బీజేపీనేత విష్ణు వర్ధన్ రెడ్డి దావూద్ ఇబ్రహీం వ్యాఖ్యలకు హీరో సిద్దార్థ్ కౌంటర్

ఇటీవల కాలంలో హీరో సిద్దార్థ్ బీజేపీ నాయకులపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. తన ఫోన్ నెంబరు లీక్ చేశారని తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని అత్యాచారం చేస్తామని హెచ్చరిస్తున్నారని బీజేపీ నాయకులపై హీరో సిద్ధార్థ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక వరుసగా బీజేపీ నేతలు ఆయనను టార్గెట్ చేస్తుంటే సిద్దార్థ్ వారికి కౌంటర్ ఇస్తున్నారు.

Recommended Video

    Siddharth కి BJP కి ముదురుతున్న వైరం.. తేజస్వి సూర్య పైన కూడా ! || Oneindia Telugu
    ఏపీ బీజేపీ లీడర్ విష్ణువర్ధన్ రెడ్డి హీరో సిద్దార్థ్ కు చురకలు, సిద్దార్థ్ రివర్స్ కౌంటర్

    ఏపీ బీజేపీ లీడర్ విష్ణువర్ధన్ రెడ్డి హీరో సిద్దార్థ్ కు చురకలు, సిద్దార్థ్ రివర్స్ కౌంటర్

    ఏపీ బీజేపీ లీడర్ విష్ణువర్ధన్ రెడ్డి హీరో సిద్దార్థ్ కు చురకలంటించారు. సిద్దార్థ్ సినిమాలకు దావూద్ ఇబ్రహీం డబ్బులు ఇస్తున్నాడని విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలను ఖండించిన సిద్ధార్థ్ ట్విట్టర్ వేదికగా విష్ణువర్ధన్ రెడ్డికి సైతం కౌంటర్ ఇచ్చారు. తాను అసలైన భారతీయుడినని, సక్రమంగా పన్ను కడుతున్నానని, వెళ్లి పడుకో విష్ణు.. ఇట్లాంటి మాటలు మాట్లాడటానికి సిగ్గు ఉండాలి అంటూ ఏపీ బీజేపీ లీడర్ విష్ణువర్ధన్ రెడ్డిపై హీరో సిద్ధార్థ రివర్స్ ఎటాక్ చేశారు. బిజెపి రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిని కూడా విమర్శించారు.

    బీజేపీ నాయకులను వరుసగా టార్గెట్ చేస్తున్న సిద్దార్థ్

    బీజేపీ నాయకులను వరుసగా టార్గెట్ చేస్తున్న సిద్దార్థ్

    తమిళనాడులో బీజేపీ నాయకులను టార్గెట్ చేసి తన కుటుంబ సభ్యులను చంపేస్తానంటూ సందేశాలు వచ్చాయని తీవ్ర ఆరోపణలు చేసిన సిద్ధార్థ్, ఆ తర్వాత వరుసగా తేజస్వి సూర్యను, ఆ వెనువెంటనే బిజెపి రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిని సైతం టార్గెట్ చేసి,బీజేపీ నాయకులపై విరుచుకుపడుతున్నారు. దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పనితీరును ప్రశ్నిస్తూ సిద్ధార్థ్ అనేకమార్లు ట్వీట్ చేశారు.

    బిజెపి ఎంపీ తేజస్వి సూర్య పైన కూడా సిద్దార్థ్ సంచలన ఆరోపణలు

    బిజెపి ఎంపీ తేజస్వి సూర్య పైన కూడా సిద్దార్థ్ సంచలన ఆరోపణలు

    ఇటీవల బిజెపి ఎంపీ తేజస్వి సూర్య పైన కూడా సిద్దార్థ్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ యువ పార్లమెంటు సభ్యుడు తేజస్వి సూర్య పై సంచలన వ్యాఖ్యలు చేసిన సిద్ధార్థ్ బెంగళూరులో పలు ఆసుపత్రులలో చాలా బెడ్స్ ఉన్నప్పటికీ వాటిని తేజస్వి సూర్య బ్లాక్ చేశాడని విమర్శించారు. యంగ్ ఎంపీ తేజస్వి సూర్య చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని టెర్రరిస్ట్ అజ్మల్ కసబ్ కంటే దశాబ్దకాలం ముందు వ్యక్తి అని పేర్కొని, ఈ ట్వీట్ ను సేవ్ చేయండి అంటూ ట్వీట్ చేశాడు సిద్ధార్థ్.

    బిజెపి నాయకులకు సిద్ధార్థ్ కు మధ్య వైరం.. చిలికి చిలికి గాలివానగా ..

    బిజెపి నాయకులకు సిద్ధార్థ్ కు మధ్య వైరం.. చిలికి చిలికి గాలివానగా ..

    ప్రభుత్వ అసమర్థత కారణంగా దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతుందని, అందువల్లే దారుణ పరిస్థితి తలెత్తుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఆస్పత్రులలో పరిస్థితి దారుణంగా మారిందని కేంద్రానికి వ్యతిరేకంగా సిద్దార్థ్ చేస్తున్న ట్వీట్లతో, బిజెపి నాయకులకు సిద్ధార్థ్ కు మధ్య మొదలైన వైరం ఇప్పుడు చిలికి చిలికి గాలివానగా మారి ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకునే దాకా వెళ్ళింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+