ఎందుకు: టీడీపీ ప్రభుత్వంపై బీజేపీ నేత, హీరో శివాజీ
గుంటూరు: నిబంధనలు పాటించని ప్రయివేటు ట్రావెల్స్ వాహనాలను కట్టడి చేయలేని వారు, ఎవరిని మోసం చేయడానికి రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారని భారతీయ జనతా పార్టీ నేత, తెలుగు హీరో శివాజీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఆయన గుంటూరులో విలేకరులతో మాట్లాడారు. పాలెం బస్సు ప్రమాద దుర్ఘటనలో బాధితులపక్షాన ఎంత పోరాడినా న్యాయం తూతూమంత్రంగానే జరిగిందన్నారు. ప్రయివేటు ట్రైవెల్స్ బస్సుల పైన చర్యలు తీసుకోకుంటే తాను కోర్టుకు వెళ్తానని చెప్పారు.
ప్రయాణీకుల భద్రతను గాలికి వదిలేసిన ప్రయివేటు వాహనాల పైన చర్యలు తీసుకోవాలన్నారు. అనుమతులు లేకుండా నడుస్తున్న బస్సులను అడ్డుకోవాలన్నారు. ఒక్క రోడ్డు ప్రమాదం కూడా జరగకుండా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందినట్లు భావించాలన్నారు.

రుణమాఫీనా.. బంగారం వేలమా?: మోపిదేవి
ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని బూటకపు ప్రకటనలు చేసి అధికారంలోకి వచ్చిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మోపిదేవి వెంకటరమణ అన్నారు.
గుంటూరు జిల్లా నగరంలో గురువారం ఆయన మాట్లాడారు. రైతుల బంగారాన్ని దగ్గరుండి వేలంవేయిస్తున్న ఘనత చంద్రబాబుకు దక్కిందన్నారు. నిజాంపట్నం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ నెలాఖరున 28 కిలోల రైతుల బంగారాన్ని వేలం వేయనున్నట్లు ప్రకటనలు వచ్చాయన్నారు.












Click it and Unblock the Notifications