చిరంజీవి Vs బాలకృష్ణ Vs దిల్ రాజు..!?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థలుగా పేరుతెచ్చుకున్నవి థియేటర్లను లీజుకు తీసుకుంటాయి. 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు లేదంటే 10 సంవత్సరాల కాలపరిమితితో తీసుకొని అదనంగా కావల్సిన హంగులను సమకూరుస్తున్నాయి. ఈ నిర్మాణ సంస్థలు నిర్మించే చిత్రాలకు థియేటర్ల కొరత అనేదే తలెత్తదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వారికింద కొన్ని థియేటర్లు ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదు.

వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి సంక్రాంతికే
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై సినిమాలు తీస్తున్న దిల్ రాజు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని థియేటర్లను లీజుకు తీసుకున్నారు. దీంతో అతను నిర్మించే సినిమాలకు థియేటర్ల కొరత తలెత్తదు. కొన్నాళ్ల క్రితం తెలుగు, తమిళ భాషల్లో వారిసువారసుడు సినిమాను ప్రారంభించారు. కొన్నాళ్ల తర్వాత కేవలం తమిళంలోనే నిర్మిస్తున్నామని, తెలుగులోకి డబ్ చేసి సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అప్పటి నుంచి తెలుగు సినీ పరిశ్రమలో వేడి రాజుకుంది. నేరుగా తెలుగు సినిమాలైన వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి కూడా సంక్రాంతికే విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

నైజాంలో దిల్ రాజుకు థియేటర్లు
ఇద్దరు అగ్ర కథానాయకులు సినిమాలు కాబట్టి థియేటర్లు కూడా పెద్ద సంఖ్యలో అవసరమవుతాయి. కానీ దిల్ రాజు వారసుడును తీసుకొస్తున్నామని చెప్పడంతో తెలుగు సినిమాలు విడుదలైన తర్వాత మిగిలినవే డబ్బింగ్ సినిమాలకు కేటాయించాలంటూ తెలుగు నిర్మాతల మండలి తీర్మానం చేసింది. దీంతో ఇది తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల మధ్య వివాదానికి దారితీసింది. చిలికి చిలికి గాలివానలా మారకముందే ఎవరో ఒకరు తగ్గాలంటూ సినీ పెద్దలు ప్రకటనలు చేస్తున్నారు. నైజాంలో ఎక్కువ సంఖ్యలో థియేటర్లు దిల్ రాజు చేతిలో ఉన్నాయి. చిరంజీవికి నైజాంలో మంచి ఫాలోయింగ్ ఉంది. వారసుడుకు కేటాయించుకుంటే వీరయ్యకు థియేటర్లు దొరకడం కష్టమవుతుంది. అలాగే బాలకృష్ణ కు సీడెడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ తర్వాత కృష్ణా, గుంటూరు, నైజాం వస్తాయి. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి రెండు సినిమాలకు మైత్రీ మూవీ మేకర్సే నిర్మాతలు.

చిరంజీవి, బాలకృష్ణ జోక్యం చేసుకోవాలి..
ఇద్దరు అగ్ర కథానాయకులు సినిమాలు విడుదలైనప్పుడు సరైన సంఖ్యలో థియేటర్లు దొరక్కపోతే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారు. కలెక్షన్లు తగ్గిన ప్రభావం సదరు హీరోల తరువాతి సినిమాలపై పడుతుంది. రెండూ ఒకేసారి విడుదలతో మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటోంది. చిరంజీవి, బాలయ్య దిల్ రాజుతో మాట్లాడి వారసుడు సినిమా విడుదలను వాయిదా వేయిస్తారా? లేదంటే సంక్రాంతి సీజన్ లో కంటెంట్ ఉన్న సినిమాలే ఆడతాయని వదిలేస్తారా? అనేది తేలాల్సి ఉంది. వీరిద్దరూ జోక్యం చేసుకోవాలంటూ అభిమానులు కోరుతున్నారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications