ఒక సినిమా మిస్ అయినా మరో సినిమా వచ్చింది!!
తమిళ సినిమా 'మాస్క్'తో పూజా హెగ్డే హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత తెలుగులో వరసగా ఒక లైలా కోసం, ముకుంద సినిమాల్లో నటించింది. వీటి తర్వాత బాలీవుడ్ సినిమా 'మొహెంజొదారో' చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. అంతే.. ఎగిరి గంతేసి ముంబయికి చెక్కేసింది. ఆ సినిమా భారీ డిజాస్టర్ గా నిలవడంతో ఎంత వేగంగా బాలీవుడ్ కు వెళ్లిందో, అంతే వేగంగా తిరిగి టాలీవుడ్ కు వచ్చేసింది.
హిట్ మీద హిట్
దువ్వాడ జగన్నాథంతో ప్రారంభించి అగ్ర హీరోల సరసన వరుసగా సినిమాలు చేస్తూ హిట్ మీద హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ గా స్థిరపడింది. అయితే ఇంతలోనే రాధేశ్యామ్, బీస్ట్, కిసికా భాయ్.. కిసికా జాన్.... ఇలా వరుసగా ఫ్లాప్స్ పలకరించడంతో ప్రస్తుతం చేతిలో ఏ సినిమా లేకుండా పోయింది. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారంలో ఎంపికైనప్పటికీ తర్వాత తేదీలు క్లాష్ అవడంతో తప్పుకుంది.

బన్నీతో మూడో సినిమా
గుంటూరు కారంలో చేసే అవకాశం లేకపోవడంతో అల వైకుంఠపురం తర్వాత బన్నీతో చేయబోతున్న సినిమాలో హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ అవకాశం కల్పించారు. 'పుష్ప2' తర్వాత అల్లు అర్జున్ తో తో త్రివిక్రమ్ చేసే సినిమాలో పూజా హీరోయిన్‌గా ఎంపికైంది. 'జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల.. వైకుంఠపురములో' చిత్రాలతో త్రివిక్రమ్ - అల్లు అర్జున్ హ్యాట్రిక్ సాధించారు. వీరిద్దరి కాంబినేషన్ లో ప్రారంభమవబోతున్న నాలుగో సినిమాలో హీరోయిన్ గా మంచి ఛాన్స్ కొట్టేసింది. 'దువ్వాడ జగన్నాథమ్, అల.. వైకుంఠపురములో' చిత్రాల్లో బన్నీతో జత కట్టిన పూజాకి ఇది హ్యాట్రిక్ మూవీ అవుతుంది. 'పుష్ప2', 'గుంటూరు కారం' తర్వాత బన్నీ, త్రివిక్రమ్ సినిమా సెట్స్‌పైకి వెళుతుంది












Click it and Unblock the Notifications