సమంత దగ్గర కూర్చోవాలంటే రూ.30 లక్షలు!
స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్యనే అమెరికా వెళ్ళింది. కొద్దిరోజులుగా ఆమె మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వైద్య చికిత్స కోసం యూఎస్ వెళ్లిందంటూ వార్తలు వచ్చాయి. అయితే తాను వెళ్లింది చికిత్స కోసం కాదని, 20వ తేదీన న్యూయార్క్ లో నిర్వహించిన 'ఇండియా డే పరేడ్'లో పాల్గొనడానికి వెళ్లానంటూ సమంత పోస్ట్ చేసింది.
తాజాగా అమెరికాలో ఈ అమ్మడు తన చిత్రం ఖుషి ని కూడా ప్రమోట్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఈవెంట్ లో కూడా పాల్గొంది. ఇందులో పాల్గొన్నందుకు నిర్వాహకులు సమంతకు రూ.30 లక్షలు చెల్లించారు. అలాగే ఈ ఈవెంట్ లో పాల్గొనేవారు రూ.12వేల నుంచి రూ.2 లక్షల వరకు టికెట్ కొనుగోలు చేసేలా రేట్లు ఫిక్స్ చేశారు. 2 లక్షల రూపాయలు పెట్టి టికెట్ కొనుగోలు చేసిన ప్రేక్షకులకు సమంతకి దగ్గరగా కూర్చునే అవకాశం ఉంటుంది.

ఓవర్సీస్ లో సమంత సినిమాలకు మంచి కలెక్షన్లు వస్తుంటాయి. కాబట్టి ఈ ఈవెంట్ కి ఎక్కువమంది హాజరయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక సమంత ఈ ఏడాది 'శాకుంతలం' సినిమాతో తన అభిమానులను పూర్తిగా డిజప్పాయింట్ చేసింది. అందుకే 'ఖుషి' సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1 న తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ , మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. శివ నిర్వాణ దీనికి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై.రవిశంకర్, నవీన్ యెర్నేని ఈ చిత్రాన్ని నిర్మించారు. షేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు మంచిపేరు వచ్చింది.












Click it and Unblock the Notifications